ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్ధి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిని అవుశపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది. చెలాకీగా ఉండే శైలేష్ ఇలా అర్ధంతరంగా తనువు చాలించాడనే వార్త విని అందరూ షాక్ అవుతున్నారు.
అవుశపూర్ గ్రామానికి చెందిన శైలేష్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ విషాద వార్త తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.