31.7 C
Hyderabad
May 2, 2024 07: 36 AM
Slider నల్గొండ

కరోనా రోగులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది

#Governament Hospital

నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో కనీస వైద్యం అందక డాక్టర్ల తీవ్ర నిర్లక్ష్యంతో యాదయ్య మృతి చెందాడని, ఈ దుర్ఘటనపై జిల్లా  సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రజాపోరాట సమితి (పీ.ఆర్.పి.ఎస్.) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి, బిసి సంఘాల రాష్ట్ర నాయకులు దుడుకు సత్యనారాయణనేత, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్, సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి యన్నమల్ల భాస్కర్ లు డిమాండ్ చేశారు.

 కెసిఆర్ ప్రభుత్వం వట్టి మాటలే మాట్లాడుతోందని, చేతలు లేవని, రాష్ట్రంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో కరోనా వైద్య సేవలు అందుతాయని ప్రకటించినా పిపిఇ కరోనా కిట్ల, వెంటిలేటర్లు కూడా అందించకుండా పేషెంట్లు, వైద్యుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు అన్నారు.

నేడు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ప్రజాసంఘాల ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వ మాటలను ఆచరణలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, వీటిని అమలు చేయకపోతే మరింత ఉద్ధృతంగా, సంఘటితంగా పోరాడుతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు దుడ్డు కృష్ణమూర్తి ముదిరాజ్, చిలకరాజు సతీష్ రజక, ఏరుకొండ హరి, శివ నేత, రావిరాల వెంకట్, పోలగోని సైదులు గౌడ్, పల్లం లింగయ్య యాదవ్, ఎండి జహంగీర్, ఉయ్యాల లింగస్వామి గౌడ్, దొడ్డి దేవదాస్, దేవేందర్, నీరుడు కరుణాకర్, వాడపల్లి సత్యనారాయణ, చిట్టిమళ్ల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిచ్చెక్కిన పాకిస్తాన్ కాల్పుల్లో మరో ముగ్గురు వీరసైనికుల మరణం

Satyam NEWS

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

Satyam NEWS

ఆర‌వ‌రోజు లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించిన సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌

Satyam NEWS

Leave a Comment