40.2 C
Hyderabad
May 6, 2024 15: 43 PM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా ముగిసిన ప్రాణహిత పుష్కారాలు

ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ఘనంగా ముగిసాయి. చివరి రోజు ఆదివారం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవాలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం ఆడుతూ నదీ తీరం వరకు ఊరేగింపుగా వేదపండితులు, అర్చకులు, భక్తజనం, ఆలయ అధికారులు తరలివచ్చారు.

నది వద్ద వేద పండితులు, అర్చకులు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రాణహిత నదికి వాయనం, (చీర, జాకెట్, గాజులు, సుగంధ పరిమళాలు) దీపాలు వెలిగించి పవిత్ర ప్రాణహిత నదికి హారతినివ్వడంతో ప్రాణహిత పుష్కారాలు ముగిసినట్టు వేదపండితులు భక్తులనుద్దేశించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలనుండి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించి తన్మయత్వం పొందారు.

ప్రాణహిత పుష్కారాలను ఘనంగా నిర్వహించడంలో పుష్కారాలకు 10 రోజుల ముందు నుండి క్షేత్ర స్థాయిలో కృషి చేసి షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పనులు, మెడికల్ క్యాంపులు, పటిష్టమైన పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పుష్కార రోజులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిన జిల్లా, మండల స్థాయి అధికారులకు , సిబ్బందిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అభినందించారు.

ప్రధానంగా పుష్కరాల విజయవంతానికి అహర్నిశలు కృషిచేసిన ఎంపిపి, జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, డిఎస్పీ, డిపివో, ఆర్డబ్ల్యూ ఇంజనీరింగ్ అధికారులు, ఇర్రిగేషన్ శాఖ అధికారులు, ఫిషరీస్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్టీసీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, రెవిన్యూ, ఎంపిడిఓ, దేవాదాయశాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ (ఏడీసీ) ఎండోమెంట్ అడిషనల్ కమీషనర్ కె. జ్యోతి, అసిస్టెంట్ కమీషనర్ ఆర్. సునీత, దేవాలయం ఈఓ మహేష్, మహాదేవపూర్ ఎంపిపి రాణిబాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులు

Satyam NEWS

అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ముక్తియార్

Satyam NEWS

రేపటి నుంచి అంబాభవానీ జాతర

Bhavani

Leave a Comment