31.7 C
Hyderabad
May 2, 2024 08: 34 AM
తెలంగాణ

డెంగ్యూ వ్యాధి నివారణపై సంపూర్ణ అవగాహన

kolla health

డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలలో భాగంగా ఈరోజు కొల్లాపూర్, పెంట్ల వెల్లి లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. మాములు జ్వరం ఉన్నంత మాత్రాన డెంగ్యూ జ్వరం అని భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలలో భాగంగా ప్రతి ఇంటిలో పాత కూలర్స్, వాటర్ బాటిల్లు, వాడని టైర్లు వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. అదే విధంగా ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ వ్యాధి ని కలుగజేసే దోమలను అరికట్ట వచ్చని డాక్టర్ సుధాకర్ లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఛైర్మెన్ కాటం జంబులయ్య, డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ భారత్, డాక్టర్ యస్వంత్ రాణి, డాక్టర్ జయ చంద్ర ప్రసాద్, వరప్రసాద్ CHO, శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్ జి.కె. వెంకటేష్ ఫార్మసీస్ట్ హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

కంట్రోల్ పాయింట్: ఆంధ్రా నుంచి ఎవరిని రానివ్వద్దు

Satyam NEWS

ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

Satyam NEWS

అందరి కళ్లూ హైకోర్టు వైపే చూస్తున్నాయి

Satyam NEWS

Leave a Comment