38.2 C
Hyderabad
May 5, 2024 20: 27 PM
Slider ముఖ్యంశాలు

జాబ్ రావాలంటే ప్రణాళికతో కూడిన ప్రిపరేషన్ చేయాలి

#ozofoundation

ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని భాగ్యనగర్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ నందు ఎస్.ఐ ప్రిలిమినరీ పరీక్షకు ఆదివారం నాడు హాజరయ్యే యువతీ,యువకులకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య వక్తగా ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు మాట్లాడుతూ ఎస్.ఐ కావాల‌నే కోరిక ఉంటే స‌రిపోదని,అందుకు త‌గిన‌ట్టుగా సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలని తెలిపారు.ఎస్.ఐ ఉద్యోగ పరీక్ష ప్రిలిమ్స్ టెస్ట్,ఫిజికల్ టెస్టు,మెయిన్స్ టెస్ట్ అనే మూడంచెలుగా ఉంటుందని,నోటిఫికేషన్లో గతంలో కంటే ప్రస్తుతం చేసిన మార్పులకు అనుగుణంగా ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, ఎస్.ఐ ఉద్యోగ కల నెరవేరాలంటే ఏం చేయాలనే విషయాలపై అభ్యర్థులకు రఘు పిల్లుట్ల పలు సలహాలు ఇచ్చారు.

అప్లై చేసినంత‌ ఈజీగా జాబ్ రాదని, జాబ్ రావాలంటే ప్రణాళికతో కూడిన ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమని రఘు తెలిపారు.పోటీ పరీక్షలలో చాలా మంది గుడ్డిగా ఏదో ఒకటి రాసేయ్యోచ్చు అనే ఉద్దేశ్యంతో ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్.ఐ పరీక్షలో మొట్ట మొదటి సారి నెగెటివ్ మార్కింగ్ సిస్టం అమలు చేస్తోందని,గుర్తించిన ప్రతీ 5 తప్పు సమాధానాలకు ఒక మార్కును కట్ చేస్తారని,ప్రతి విద్యార్థి కూడా నెగిటివ్ మార్కింగ్ సిస్టం దృష్టిలో పెట్టుకొని సమాధానాలు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్.ఐ ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని,సంబంధిత శాఖ అధికారులను ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు పిల్లుట్ల కోరారు.

పరీక్షా విధానంలో ఎక్కడా అవకతవకలు జరగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని అందుకు గాను అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు విధానంపై పరీక్షా నిర్వహకులు సరైన అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్​ స్వామినాథన్​ కన్నుమూత

Satyam NEWS

హైదరాబాద్ బోలక్ పూర్ వద్ద విద్యుత్ షాక్ తో బాలుడు మృతి

Satyam NEWS

విజయనగరం పోక్సో కోర్ట్ సంచలన మైన తీర్పు….!

Satyam NEWS

Leave a Comment