28.7 C
Hyderabad
April 27, 2024 05: 56 AM
Slider కడప

గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి

#bhatyala

మహిళ పట్ల నగ్నంగా ప్రవర్తించిన గోరంట్ల మాధవ్ ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు డిమాండ్ చేశారు. చరవాణిలో మహిళ పట్ల నగ్నంగా కనిపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

నిన్న మీడియా ద్వారా బయటకు వచ్చిన గోరంట్ల మాధవ్ రాసలీలలపై బత్యాల రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు  శుక్రవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ భారతదేశ గౌరవ ప్రదమైన పార్లమెంట్ లో తెలుగురాష్ట్రాల ఎంపీ లు  మిగతా రాష్ట్ర ఎంపీల ముందు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్తితి వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ తీసుకువచ్చాడని అన్నారు.

గోరంట్ల మాధవ్ పై గతంలో 376, 302, 506 సెక్షన్ల క్రింద కేసులు ఉన్నాయని తెలిసి కూడా ఎంపీ టికెట్ ఇచ్చారంటే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటనేది అద్ధం పట్టినట్లు రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పటికే అర్థం అయి ఉంటుందని అన్నారు. బాధ్యతయుతమైన ప్రజాప్రతినిధిలుగా ఉండి మహిళల పట్ల గంట వస్తావా, అరగంట వస్తావా అంటూ అసంబ్యకరంగా మాట్లాడిన అవంతి శ్రీనివాస్ రావు, అంబటి రాంబాబు పై చర్యలు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మంత్రి పదవులు కట్టబెట్టి వైకాపా పార్టీని కామాంధుల పార్టీగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు.

వీరితో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇ కోవకు చెందిన వారేనని అందుకే ఒకే రకమైన పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు ఈ రకమైన నాయకులంతా మన రాష్ట్రాన్ని పాలించడం మన దౌర్భాగ్యమని అన్నారు. ఇప్పటికైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వైకాపా నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిపై కటిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరుపున, రాజంపేట నియోజకవర్గ ప్రజల తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అనసూయ దేవి, పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రమణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్య నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి మండెం అబుబకర్, మండల ప్రధాన కార్యదర్శి చెప్పలి కేశవ, పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్ రాజు, కార్యనిర్వాహక కార్యదర్శులు కొండా శ్రీనివాసులు, కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, మాజి కౌన్సిలర్ గుగ్గిళ్ళ చంద్రమౌళి, సీనియర్ నాయకులు ఇడిమడకల కుమార్, డాక్టర్ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దొడ్డిపల్లి వెంకటసుబ్బరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీను, TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, నందలూరు మండల క్లస్టర్ ఇంచార్జీ పసుపులేటి ప్రవీణ్, పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ జడ శివకుమార్, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒబిలి మల్లిఖార్జున రెడ్డి, పార్లమెంట్ తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి యస్.కె కరీమ్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు జనార్ధన్ రాజు, అనమలగుండం విజయ్ కుమార్, వార్డు అధ్యక్షుడు చింతల హరీష్, సురేష్, ఐటీడీపీ మేడ మునిబాల, కోట, వాణిజ్య విభాగం అసెంబ్లీ కార్యదర్శి జయరామ్ రెడ్డి, కోట శంకర్, కేత నరసింహ, తోట ప్రసాద్, మళ్లెం నరేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదరణ పని ముట్లు…. దాచారు… అమ్ముకున్నారు

Satyam NEWS

సమాచార హక్కు చట్టంపై అవగాహన వుండాలి

Murali Krishna

ఎనదర్ యాంగిల్: కోవిడ్ పేరుతో హక్కుల అణచివేత

Satyam NEWS

Leave a Comment