39.2 C
Hyderabad
April 30, 2024 21: 37 PM
Slider రంగారెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు

#vikarabad

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కావలసిన అన్ని చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల అనుసంధాన రోడ్ల పరిధిలో అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు,  రవాణా, జాతీయ  రహదారు లు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని ప్రమాద స్తలాలను గుర్తించి ఇట్టి స్థలాల్లో ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు ,  సూచిక బోర్డులతో పాటు అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

పోలీస్ , రవాణా,  జాతీయ రహదారుల అధికారులు సంయుక్తంగా ప్రమాదకర స్తలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.   

రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి రోడ్ల పరిధిలో కూడా సంబంధిత అధికారులు స్పీడ్ బ్రేకర్లు,  సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జెడ్పి సీఈవో జానకి రెడ్డి , జిల్లా రవాణా అధికారి పి వెంకట్ రెడ్డి,   పంచాయతీ రాజ్ ఇ.ఇ శ్రీనివాస్ రెడ్డి , ఆర్ అండ్ బి ఇ.ఇ.  శ్రీధర్ రెడ్డి,  జాతీయ రహదారుల ఇంజనీరింగ్  ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్యాంగ్ రేప్:మైనర్ బాలిక ను నిర్బంధించి అత్యాచారం

Satyam NEWS

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Satyam NEWS

మనిషి ఆకారంలో వింత పురుగు

Bhavani

Leave a Comment