38.2 C
Hyderabad
May 3, 2024 19: 10 PM
Slider జాతీయం

లాస్ట్ ఛాన్స్:రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరిన నిర్భయ నిందితుడు

mukesh singh

ఈ నెల 22న నిర్భయ ఘటన దోషులను ఉరితీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతుండగా, దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు. తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని ఇప్పటికే ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసింది.

దీన్ని సవాల్ చేస్తూ దోషులు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసినా వారి పిటిషన్ ను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ గతంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను క్షమాభిక్ష కోరాగ అందుకు అర్హుడు కాదంటూ అతడి దరఖాస్తును కొట్టివేశారు. ఇప్పుడు ఉరికి అన్ని ఏర్పాట్లు జరుగుత్ను సమయంలో ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకోవడం ఈ వ్యవహారాన్ని మలుపు తిప్పింది.కాగా దీనిపై రాష్ర్ట్రపతి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related posts

బీజేపీ విధానాలపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి

Satyam NEWS

సైకో పాలన కారణంగా ఏపీలో పెరుగుతున్న‌ నిరక్షరాస్యత

Satyam NEWS

రాజకీయ కుట్ర తోనే డీకే శ్రీనివాస్ పై డ్రగ్స్ కేసు

Satyam NEWS

Leave a Comment