38.2 C
Hyderabad
May 3, 2024 19: 46 PM
Slider ప్రపంచం

ట్రంప్ చెత్త పాలనను ఎండగట్టిన పెంటగాన్ మాజీ అధికారి

#Donald Trump

అమోరికాను కలిపి ఉంచేందుకు కాకుండా విడదీసేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారని పెంటగాన్ మాజీ ముఖ్య అధికారి జిమ్ మాట్టీజ్ అన్నారు. కనీసం అమెరికాను కలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటించడం కూడా లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సిరియా నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్టీజ్ తన పదవికి రాజీనామా చేశారు. ‘‘ అమెరికాను విడదీసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడిని నేను నా జీవిత కాలంలో మొట్టమొదటి సారి చూస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

అమెరికాలో పెరుగుతున్న జాతి వివక్షను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ఏ మాత్రం ప్రయత్నం చేయకపోగా విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఏ మాత్రం పరిణితి లేని పాలనను చూస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.

శాంతి యుతంగా అమెరికన్లు నిరసన వ్యక్తం చేస్తున్నా మిలిటరీని పంపుతానని ట్రంప్ బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.

Related posts

వనపర్తి పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

Satyam NEWS

దళితుల జీవితాల్లో ధైర్యం నింపిన దేవుడు కేసీఆర్

Satyam NEWS

న‌వంబ‌రు 29న తిరుచానూరులో వ‌ర్చువ‌ల్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌

Satyam NEWS

Leave a Comment