39.2 C
Hyderabad
April 30, 2024 20: 52 PM
Slider ప్రత్యేకం

ప్రెస్ అకాడెమీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకోండి

#allamnarayana

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ

ప్రెస్ అకాడెమీ చైర్మన్ జర్నలిస్టుల సమస్యలను ఏనాడూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన పాపాన పోలేదని అయితే ఎవరు జర్నలిస్టులో ఎవరు కాదో తేల్చేందుకు మాత్రం ఆయన ముందు ఉంటున్నారని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ విమర్శించారు.

సీఎం, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు విమర్శలు ప్రతి విమర్శలు సహజమేనని అయితే జర్నలిస్టులను కాదని ప్రభుత్వానికి ఆయన వత్తాసు పలకడమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ గా తెలంగాణలోని వేలాది జర్నలిస్టులకు కనీస సేవ చేయకుండా పత్రికా రంగంలోని సిబ్బంది సమస్యలను పరిష్కరించకుండా ఎవరు అసలు జర్నలిస్టులు, ఎవరు నకిలీ జర్నలిస్టులు కనిపెట్టకుండా నిజాయితీ కలిగిన జర్నలిస్టులు వివిధ కారణాలతో మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోకుండా అల్లం నారాయణ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

పాత్రికేయ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మెరుగైన పరిహారం అందించకుండా పత్రికా మిత్రుల ఫ్యామిలీస్ కి నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం అందించకుండా రాష్ట్ర ప్రెస్ అకాడెమీ సారథిగా ఏం చేస్తున్నారు.? జర్నలిస్టుల సమస్యలపై ఇన్ని రోజులు నిద్రావస్థలో ఉన్న మీరు ఇప్పుడెలా స్పందిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. వివాదాస్పద రాజకీయాల్లో అల్లం నారాయణ  జోక్యం అక్కర్లేదని ఆయన అన్నారు. అల్లం నారాయణ ప్రెస్ అకాడెమీ సారథిగా జర్నలిస్టు సంఘాల ప్రశ్నలపై స్పందించాలి. ప్రభుత్వం దృష్టిలో నిజమైన జర్నలిస్టులు అంటే ఎవరు.? నిజమైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఎందుకివ్వట్లేదు.

నిజమైన జర్నలిస్టులను ఎలా గుర్తిస్తారో చెప్పాలని ఆయన కోరారు. నిజమైన జర్నలిస్టులు అంటే అక్రిడేషన్ కార్డు గుర్తింపు కార్డులు ఉన్నవాళ్లా.?లేక జర్నలిజం డిగ్రీ పట్టా ఉన్నవాళ్లా.? డిగ్రీ పాసై అర్హత ఉండి జర్నలిజం పట్ల తపన ఉండి కూడా అక్రిడేషన్ కార్డు లేని వాళ్ల.? వారిని ఎవరు సర్టిఫై చేస్తారో కూడా అల్లం సెలవిస్తే బాగుంటుంది. పత్రికల్లో పనిచేస్తున్న అందరి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మరి ఎందుకు అల్లం నారాయణ జారీ చేయలేకపోతున్నారో తెలపాలి. చాలా మంది నిజమైన జర్నలిస్టులకు ఇప్పటివరకు అక్రిడేషన్ కార్డులు లేవు మరి వారు జర్నలిస్టులు కారా.? అని ఆయన ప్రశ్నించారు. అల్లంకు చేతనైతే ఆర్ ఎన్ ఐ అనుమతితో నడుపుతున్న పత్రికలలో పనిచేస్తున్న అందరి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Related posts

లాకప్ లో కోడి పుంజు

Bhavani

అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

Satyam NEWS

ప్రపంచ ఓజోన్ డే కవితల పోటీకి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment