38.2 C
Hyderabad
May 3, 2024 20: 16 PM
Slider ముఖ్యంశాలు

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన నిర్ణయం

#pvramesh

స్కిల్ డెవలప్మెంట్ విషయంలో దొంగ కేసు పెట్టి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్టు చేయటం కరెక్టు కాదని చెప్పిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కి సలహాదారుడుగా పని చేస్తున్నారు. దీనితో బాటు ఆయన పలు సంస్థలకు సలహాదారుడుగా, న్యాయ సంబంధిత అంశాలపై విద్యార్ధులకు బోధకుడుగా కూడా పని చేస్తున్నారు.

పి వి రమేష్ ఎప్రూవర్ గా మారారని, అందువల్లే చంద్రబాబును ఏపి సిఐడి పోలీసులు అరెస్టు చేశారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని పి వి రమేష్ తీవ్రంగా ఖండించారు. తాను ఎప్రూవర్ గా మారలేదని, తాను ఇచ్చిన స్టేట్ మెంట్ ను సీఐడీ పోలీసులు ఈ విధంగా వాడుకుంటారని అనుకోలేదని ఆయన వివరణ ఇచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. కార్పొరేషన్ ఎండిగా ఉన్న వ్యక్తిని వదిలేసి ముఖ్యమంత్రిని ఎలా బాధ్యుడిని చేస్తారని రమేష్ ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయిన విధానం, అందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాత్రను పి వి రమేష్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. రాష్ట్ర మంత్రి వర్గ తీర్మానం మేరకు ఏర్పాటు అయిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి వాటిని వినియోగించారని అందువల్ల ఇందులో చట్ట ఉల్లంఘన ఉండే అవకాశమే లేదని పి వి రమేష్ స్పష్టం చేశారు. కొన్ని ఫైళ్లు కనిపించడం లేదని సిఐడి పోలీసులు కోర్టులో చెప్పిన విషయం పై కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రతి ఫైల్ కు ఆర్ధిక శాఖలో షాడో ఫైల్ ఉంటుందని, ఆ షాడో ఫైల్ చూస్తే విషయం అర్ధం అవుతుందని ఆయన వివరించారు. పి వి రమేష్ ఇచ్చిన వివరణ తో ఏపీ సీఐడి పోలీసులు ఇరకాటంలో పడ్డారు. దాంతో లండన్ పర్యటన నుంచి రాగానే జగన్ నుంచి రియాక్షన్ వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత మేఘా కంపెనీలో సలహాదారుగా ఉన్న పీవీ రమేష్ ను సిఎం కోరిక మేరకు ఆయన్ని రిజైన్ చేయాలని వాళ్లు అడిగారు.

ఆయన వెంటనే, అంటే నిన్న, రిజైన్ చేశారు. వాస్తవానికి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది.  ఈ మేరకి పత్రికలకి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే జగన్ నుంచి మేఘాకి, మేఘా నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టొద్దని వాళ్లు చెప్పారు. ఆయన ఒప్పుకోలేదు. అలాగయితే తమదగ్గర కొనసాగడం కష్టం అని చెప్పారు. ఉద్యోగం నుంచి వైదొలగడానికి ఆయన సంసిద్ధులయ్యారు.

ఈ మేరకు నిన్న సాయంత్ర ఆయన రాజీనామా లేఖని సమర్పించారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డిలది. వాళ్లు పట్టిసీమ పని చేసినప్పుడు, చంద్రబాబుతో కలిసి డబ్బులు తిన్నారని జగన్ ఆరోపించాడు. అధికారంలోకి వచ్చాక పోలవరంతో సహా ఎన్నో కాంట్రాక్టలు వారికే జగన్ ఇచ్చాడు. మేఘా ద్వారా టీవీ 9, ఎన్టీవీల్లో వాటాలు కొనిపించి, వాళ్ల మీద ఆధిపత్యం సంపాదించాడు. ఇప్పుడు జగన్ ఆదేశాల ప్రకారం, తమ సంస్థలో సలహాదారుగా ఉన్న పీవీ రమేష్ ను రిజైన్ చేయించారు.

Related posts

ఎల్లోమీడియాకు బ్రెయిన్ ఫీవర్

Satyam NEWS

విడుదల సన్నాహాల్లో లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ “నేనెవరు”

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా PV శత జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment