26.2 C
Hyderabad
May 10, 2024 20: 06 PM
Slider విజయనగరం

మణిపూర్ ఘటనకు పీఎం మోడీ బాధ్యులు కాదా…!

#rally

దేశంలో సెవిన్ సిస్టర్ గా ఖ్యాతి గడించిన రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ లో జరిగిన ఘటనకు ప్రధాని మోడీ బాధ్యులు, కారకులు కారా అంటూ… మైనారిటీ లైన క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ లకు చెందిన దాదాపు అయిదువేల మంది కి పైగా… పలువురు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం లో కోట జంక్షన్ నుంచీ ప్రారంభమైన ర్యాలీ,…మూడులాంతర్లు ,గంటస్థంభం, కన్యకాపరమేశ్వరి, కంటోన్మెంట్, గూడ్స్ షెడ్, మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. అయితే కలెక్టరేట్ సమీపంలో బీజేపీ.. సర్పంచ్ ల సమస్యలపై ధర్నా చేస్తుండటంతో… కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ వద్ద నుంచే వచ్చి… ఎస్పీ ఆఫీస్ వద్ద జాతీయ రహదారి ని బ్లాక్ చేసి.. దాదాపు అరగంటపైగానిరసన వ్యక్తం చేశారు.

మణిపూర్ ఘటనలో… ఇంత జరిగిన పీఎం మోడీ ఎందుకు వెళ్లలేదని  క్రిస్టియన్ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి కావడంతో అటు వైపు వెళ్లే వాహనాలు నిలచిపోవడంతోట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ నుంచీ ర్యాలీ గా కలెక్టరేట్ జంక్షన్ వద్దకు వచ్చి… పూర్తిగా రోడ్ ను స్తంభించారు.అక్కడే ఓ వైపు ఎన్టీఆర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ విగ్రహం మధ్యలో.. క్రిస్టియన్, ముస్లిం వ్యక్తులు మొనలహారం చేసి…గట్టిగా నినదించారు. పరిస్థితి సీరియస్ అవుతోందని గ్రహించిన డీఎస్పీ గోవింద రావు…రూరల్ వన్ టౌన్ పోలీసులు రప్పించి… అలెర్ట్ అయ్యారు. ఎట్టకేలకు గంటన్నర తర్వాత… పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకు వచ్చారు… పోలీసులు.

Related posts

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

టీడీపీ నేతలపై రాళ్లదాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

Satyam NEWS

విశాఖలో విష వాయువుల విలయతాండవం

Satyam NEWS

Leave a Comment