27.7 C
Hyderabad
May 14, 2024 04: 03 AM
Slider సంపాదకీయం

ప్రయివేటు స్కూళ్ల లాబీ మరీ ఇంత పవర్ ఫుల్లా?

private schools

దేశంలో కరోనా ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందో తెలుసా? ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పరూ? ఒక రోజు జనతా కర్ఫ్యూ తర్వాత 21 రోజుల లాక్ డౌన్ అయింది. అది మరింత ముందుకు వెళ్లి మొత్తం 40 రోజుల లాక్ డౌన్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా దానిపై దృష్టి సారించలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 7వ తేదీ వరకూ పొడిగించింది.

తెలంగాణ ప్రభుత్వం అయితే క్వారంటైన్ కాలాన్ని కూడా పొడిగించింది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి ఇంట్లోనే అల్లాడుతున్నారు. ఎంత మందికి ఉద్యోగాలు ఉంటాయో ఎంత మందికి ఊడతాయో తెలియని అయోమయ పరిస్థితి. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మే నెల నాటికి దేశంలో దాదాపుగా 38,000 మరణాలు సంభవించే అవకాశం ఉంది.

అదే విధంగా 5 లక్షల మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న 652 నుండి మరణాల సంఖ్య 38220 కి పెరుగుతుందని  జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, ముంబై ఐటి, పూణేలోని సాయుధ దళాల ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

కరోనా వ్యాప్తి నిరోధానికి ముందుగా మూసింది స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమాహాళ్లు. కరోనా ముగిసిన తర్వాత కూడా చివరి వరకూ మూసి ఉండేవి కూడా ఇవే. కదా? ఇవన్నీ భారత దేశ ప్రధాని నరేంద్రమోడీనే చెబుతున్నారు కదా?  

ఈ విషయాలు ఇలా ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసా? స్కూళ్లు, కాలేజీలు ఏదో వచ్చే నెలకల్లా తెరిచేస్తున్నట్లు, పిల్లలు స్కూళ్లకు కాలేజీలకు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకూ గమనించకపోతే ఇప్పుడు గమనించండి.

స్కూళ్ల ఫీజుల గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి? ఎందుకు? స్కూళ్లు కాలేజీలు ఎప్పుడు తెరుస్తారో కచ్చితంగా చెప్పగలరా? పిల్లలు స్కూళ్లకు ఎప్పుడు వెళ్లాలో తేదీ నిర్ణయించగలరా? స్కూళ్లు, కాలేజీల ఫీజుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?

ఇప్పుడు ఈ కరోనా సమయంలో స్కూలు ఫీజుల గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాట్లాడటం విచిత్రంగా అనిపిస్తున్నది. ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల వాళ్లు చేస్తున్న వత్తిడికి ప్రభుత్వాలు ఎందుకు లొంగుతున్నాయి? ఫీజుల గురించి స్కూలు పిల్లల డ్రెస్ ల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఎందుకు ఇస్తున్నాయి?

ఏపి ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల అడ్మిషన్స్ సమయంలో కేవలం ఒక త్రైమాసిక ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది ఫిక్స్ చేసిన ఫీజుల ఆధారంగానే మొదటి త్రైమాసిక ఫీజుల వసూలు చేయాలని తెలిపింది.

ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు స్కూళ్లు, కాలేజీల ఫీజులను చెల్లించేందుకు ఇన్‌స్టాల్మెంట్స్ సదుపాయం కల్పించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

మొదటి త్రైమాసిక ఫీజు రెండు విడతలగా కట్టించుకోవలని సూచన చేసింది. అలాగే రెండు విడతలకు కనీసం 45 రోజుల వ్యవధి ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణ కూడా దాదాపుగా ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పి ఇవన్నీ చేస్తే బాగుంటుంది. స్కూళ్లు కచ్చితంగా ఎప్పుడు తెరుస్తారు చెబుతారా? స్కూళ్లు, కాలేజీల లాబీ పై కాకుండా ప్రభుత్వాలు కరోనాపై దృష్టి సారిస్తే మంచిది.

Related posts

ఉక్రెయిన్ లో జరుగుతున్న పాశవికదాడిపై భారత్ ఆందోళన

Satyam NEWS

రుక్మిణి,సత్యభామ,సీతా,రామ,లక్ష్మణులకు రజితాభరణాల బహుకరణ

Satyam NEWS

మాజీ ప్రధాని పివి నర్సింహారావు శత జయంతి వేడుకలు

Satyam NEWS

1 comment

Krishnakumar bachiraju April 24, 2020 at 7:06 PM

Postings are good and interesting

Reply

Leave a Comment