38.2 C
Hyderabad
April 29, 2024 13: 59 PM
Slider హైదరాబాద్

చర్చి పైన నిరాటంకంగా సినిమా షూటింగ్

Cinema Shooting

ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు. లాక్ డౌన్ నిబంధనలు ఏమయ్యాయో తెలియదు. అసలు అంత మంది అక్కడకు ఎలా వచ్చారో తెలియదు. లాక్ డౌన్ సమయంలో సినిమాల షూటింగ్ పై నిషేధం ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఒక చర్చిపై షూటింగ్ జరిగింది.

ఒక షార్ట్ ఫిలిమ్ షూటింగ్ ను చర్చిలో నిరాటంకంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలోని గోకుల్ ఫ్లాట్స్ లోని ఒక చర్చిలో ఈ సంఘటన జరిగింది. నిన్న ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకూ అక్కడ ఫిలిమ్ షూటింగ్ జరిగింది. ఎవరూ ఇదేమని అడగలేదు. వారిని ఆపలేదు.

కెమెరాలు లైట్లు యథేచ్ఛగా పని చేశాయి. లాక్ డౌన్ నిబంధనలు పాటించండిరా లేకపోతే చచ్చిపోతారు, మీ పక్కన ఉండే వాళ్లకు కూడా ప్రమాదం అని ఎంత చెప్పినా వినడం లేదు. ఈ కరోనా కారియర్స్ వల్లే సమాజానికి ప్రమాదం.

 ఇప్పటి వరకూ కరోనా ఎవరి నుంచి సంక్రమించిందో తెలుసుకోవడానికి వీలు ఉన్న కేసులే రావడం వల్ల స్టేజి 2లోనే ఉన్నాం. ఇలా షూటింగులు, మీటింగులు చేసుకుంటూ పోతే 3వ దశకు వచ్చేస్తాం. బివేర్.  

Related posts

సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా: చంద్రబోస్

Bhavani

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

Satyam NEWS

పాత్రుని వలసలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

Satyam NEWS

Leave a Comment