33.2 C
Hyderabad
May 4, 2024 01: 39 AM
Slider వరంగల్

దివ్యంగులకు ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ చేయూత

#priyanestam

ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ములుగు జిల్లా కు చెందిన దివ్యాంగులు నూనె సతీష్, గుర్రం శ్రీహరిలకు  కృత్రిమ కాలు అమర్చి చేయూతనందించారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె సతీష్  ప్రైవేటు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ   తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో వరంగల్ జిల్లా ఊరుగొండ వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ కుడికాలు మోకాలు పై వరకు తీసివేయగా మరో కాలు కు గాయాలయ్యాయి. 

గత 6  నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో భార్య ఇద్దరు పిల్లలతో  ఇబ్బందిపడుతుండగా అదే గ్రామానికి చెందిన  జర్నలిస్ట్  కూనూరు మహేందర్  సతీష్ ఆర్థిక స్థితిగతుల గురించి, అతని ఇబ్బందుల గురించి  ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్  వ్యవస్థాపక అధ్యక్షులు  నాగరాజు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

దీనికి స్పందించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు పింగళి నాగరాజు  మార్చి 25న జంగాలపల్లి గ్రామాన్ని సందర్శించి సతీష్ ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని, తక్షణ సహాయంగా 50 కేజీల ఫైన్ రైస్ నిత్యావసర లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కాలి గాయం పూర్తిగా మారిన తర్వాత కృత్రిమ కాలు ను  ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ మేరకు ట్రస్టు నిర్వాహకులు నాగరాజు గురువారం హైదరాబాద్ కు  తీసుకువెళ్లి కృత్రిమ కాలు అమర్చారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ  కృత్రిమ కాలు అమర్చడం పునరుజ్జీవం లాంటిదని ట్రస్ట్ అధ్యక్షులు నాగరాజు కి   కృతజ్ఞతలు తెలిపారు.

వెంకటాపూర్ మండలం  నుండి ఒకరికి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కాంటాక్ట్ బేసిక్ పై  పనిచేస్తూ  మోకాలి కింది భాగాన ఇన్ఫెక్షన్ అయి 6 నెలల క్రితం  కాలు తీసి వేశారు

కాగా శ్రీహరి కి కృత్రిమ కాలు అమర్చుకొనే స్తోమత  లేక ప్రియనేస్తం ట్రస్టు నిర్వాహకులు పింగిలి నాగరాజును ఆశ్రయించగా  గురువారం అతనికి కూడా ట్రస్టు ఆధ్వర్యంలో  కృత్రిమ కాలు అమర్చడం జరిగింది ఈ సందర్భంగా శ్రీహరి ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

వాల్మీకులను మోసం చేసిన కెసిఆర్: డి.నారాయణ

Satyam NEWS

నాన్నకు ప్రేమతో..

Satyam NEWS

ఏపిలో వ్యవసాయానికి సలహాదారుడు కృష్ణారెడ్డి

Satyam NEWS

Leave a Comment