25.2 C
Hyderabad
May 8, 2024 07: 34 AM
Slider నల్గొండ

రామాలయ తొలి కమిటీ సమావేశం పలు తీర్మానాలు

#temple committee

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రములో వేంచేసియున్న శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి దేవస్థానం పాలకమండలి తొలి సమావేశం ఆలయ చైర్మన్ ముడుంబ జగన్నాథచార్యులు అధ్యక్షతన జరిగింది.

పాలకమండలి సమావేశంలో పురాతనమైన రామాలయాన్ని స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సహాయ, సహకారాలతో కామన్ గుడ్ ఫండ్ నుండి నిధులు మంజూరు చేయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, దేవస్థానం ఆదాయ వ్యయాలు, స్థిర చరాస్తులు పై చర్చించారు.

నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రెండు కార్లు వరి పంట పండిస్తూ అతి తక్కువ కవులు చెల్లిస్తున్నారని, దేవాలయ భూములను కౌలుకు చేసుకునేవారు ఈ సంవత్సరము పెంచిన రేట్ల ప్రకారంగా అందరూ కౌలు బకాయిలను తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో బకాయిదారులను తొలగించి ఇట్టి దేవాలయ భూములను బహిరంగ వేలం ద్వారా ఇతరులకు కౌలుకు ఇవ్వాలని సమావేశం తీర్మానించినట్లు ఆలయ ఈ.ఓ.కొండా రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో రామిశెట్టి రాము, లక్క వెంకన్న,మేరిగ గురవయ్య,వెన్న పద్మ, ఎక్స్ అఫీషియో మెంబర్ నరగిరినాధుని నరసింహాచార్యులు పాల్గొన్నారు.

Related posts

డాక్టర్ అవతారం లో విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్

Satyam NEWS

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ “భీమ్ దీక్ష”

Satyam NEWS

మహిళలచే స్వయంగా దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయించండి

Satyam NEWS

Leave a Comment