31.7 C
Hyderabad
May 6, 2024 23: 28 PM
Slider మహబూబ్ నగర్

మగ పిల్లలతో పాటు ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వటమే న్యాయం

#narayanapet judge

మగ పిల్లలతో పాటు ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వడం న్యాయమని కల్వకుర్తి న్యాయమూర్తి అర్పితా మారం రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండలం జంగారెడ్డి పల్లిలో శుక్రవారం గ్రామ సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కల్వకుర్తి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి మాట్లాడుతూ చిన్నచిన్న తగాదాలకు పోలీస్ స్టేషన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం డబ్బు వృధా చేసుకోకూడదని పేర్కొన్నారు.

రాజీ మార్గమే రాజా మార్గమని సూత్ర ప్రకారం ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుని కేసులు పరిష్కరించకుంటే ఇరువర్గాలకు మనశ్శాంతి లభిస్తుందని హితవు పలికారు. అదేవిధంగా ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఆడపిల్లలకు విద్యతో పాటు విలువలుకూడా నేర్పాలని,  తల్లిదండ్రులు వారితో ప్రేమగా మెలగడమే గాక మంచి నడవడిక నేర్పాలన్నారు. తల్లిదండ్రులకు నిజమైన ఆస్తి పిల్లలే అని వారి పురోభివృద్ధికి తగిన సమయం కేటాయించాలని వక్రమార్గంలో నడవకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

అనంతరం న్యాయ సదస్సుకు హాజరైన న్యాయవాదులు సి. కృష్ణయ్య లావుని పట్టాలపై, భాస్కర్ రెడ్డి సైబర్ నేరాల పైన, జయంత్ కుమార్ ఆడవారికి ఆస్తి స్త్రీలపై అఘాయిత్యాల పైన, అవగాహన కల్పించగా, వెంకట నారాయణ గౌడ్ అన్నదమ్ముల బాగా పరిష్కారాలు హిందూ వారసత్వ చట్టం పై, యాది లాల్ బ్యాంకు కేసులపై జి వెంకట్ గౌడ్ చట్టాలపై నా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల ఎంపీడీవో రాఘవాచారి ఎస్ఐ వరప్రసాద్ సిఐ దేవేందర్ సెక్రటరీ జానయ్య సదానందం కోర్టు సిబ్బంది న్యాయవాదులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

57 ఏండ్లు నిండిన వారు ఆసరా పింఛన్ కు  దరఖాస్తు చేసుకోండి

Satyam NEWS

స్పందనకు పెరిగిన ఫిర్యాదు దారులు..ఈ సారి 34 మంది..!

Satyam NEWS

[Best] Hemp Cbd Cigs Nyc Cbd Hemp Flower Warning Label Organic Non Gmo Hemp Cbd Moisturizing Lotion

Bhavani

Leave a Comment