30.7 C
Hyderabad
April 29, 2024 06: 57 AM
Slider విజయనగరం

స్పందనకు పెరిగిన ఫిర్యాదు దారులు..ఈ సారి 34 మంది..!

#depikaips

ప్రతీ సోమవారం మాదిరిగా నే విజయనగరం జిల్లా లో ప్రతీ  జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దీపికా… స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సారి జరిగిన స్పందనలో గత కన్నా అధిక సంఖ్యలో బాధితులు తమ ,తమ సమస్యలను ఎస్పీ ముందు చెప్పుకున్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపిక నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 34 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విజయనగరంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరం పట్టణంకు చెందిన ఒక వ్యక్తి తనవద్ద నుండి కొంత డబ్బులు అప్పుగా తీసుకొని, తిరిగి ఇవ్వడం లేదని తన డబ్బులు తనకు ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సిఐని ఆదేశించారు.

‘‘నాకు తెలియకుండానే నా ఎకౌంట్ నుంచి డబ్బులు మాయం అయ్యామయి’’

విజయనగరం, జమ్ము నారాయణపురంకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ తనకు రెండు బ్యాంకు అక్కౌంట్లు ఉన్నట్లు, తన బ్యాంకు అక్కౌంట్ల నుండి తనకి తెలియకుండా తన డబ్బులు విత్ డ్రా అయినట్లు తనకి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐని ఆదేశించారు.

విజయనగరం శివాలయం వీధికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ విజయనగరం పట్టణంకు చెందిన ఒక వ్యక్తికి అవసరం నిమిత్తం కొంత డబ్బులు ఇచ్చినట్లు, ప్రసుత్తం సదరు వ్యక్తి తన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ రెస్పాండెంట్ ను పిలిచి, విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సిఐని అదేశించారు.

గంట్యాడ మండలం, సిరిపురంకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన భూమిలో పశువుల శాలను నిర్మిస్తూ తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ, తన పై దౌర్జన్యం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని గంట్యాడ ఎస్ఐని ఆదేశించారు.

గుర్ల మండలం మండలం, బెల్లాన పేట గ్రామానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త వేరొక ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని, తన మరియు తన కుమార్తెల యొక్క బాగోగులు చూడడం లేదని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని గుర్ల ఎస్ఐని ఆదేశించారు.

స్వీకరించిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జి అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, ఎస్బీ సిఐ సి. హెచ్. రుద్రశేఖర్, ఎస్ఐలు కృష్ణవర్మ, మురళి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్

Satyam NEWS

కీసరలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: దొరికిన అమ్మాయిలు

Satyam NEWS

జాతీయ స్థాయి స్విమ్మింగ్ మెడల్ సాధించిన వసీం

Satyam NEWS

Leave a Comment