29.7 C
Hyderabad
May 3, 2024 03: 05 AM
Slider మహబూబ్ నగర్

కేటీఆర్…మళ్ళీ రాళ్లేయడాని కే వస్తున్నారా…?

#nagurao Namajee

నారాయణపేటకు 4ఏళ్ల క్రితం వచ్చిన మంత్రి కేటీఆర్ మళ్లీ ప్రజలపై రాళ్లేయ దానికే వస్తున్నారు తప్ప ఒక్క హామీ నిలబెట్టుకోలేదని బిజెపి రాష్ట్ర నాయకులు నాగు రావు నామా జి, కే.రతన్ పాండు రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు పి. శ్రీనివాసులు విమర్శించారు.

శుక్రవారం నారాయణపేట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4ఏళ్ల క్రితం ఇదే కేటీఆర్ జాయమ్మ చెరువు నింపుతామని నేటికీ నింపలేదన్నారు. డబుల్ బెడ్రూంలు, ఇంటింటికి నల్లాలు ఏమయ్యాయని వారు ప్రశ్నిచారు.

తిరిగి మళ్లీ శంకుస్థపనలు చేయడానికి వస్తుండడం సిగ్గు చేటన్నారు. 7 ఏళ్లలో సాధించింది పార్టీ కార్యాలయం,ఎమ్మెల్యే  కార్యాలయం మాత్రమే అన్నారు.

69 జీఓ అమలు చేస్తామని స్పష్టమైన ప్రకటన మంత్రి చేయాలని ఎమ్మెల్యే చేయించాలని డిమాండ్ చేశారు. కాగా పట్టణంలో ఆక్రమణ ల తొలగింపును స్వాగతిస్తున్నామని కానీ అధికారులకు అధికార పార్టీ నాయకులు చేసిన కబ్జాలు కనిపించవా అని ప్రశ్నించారు.

కృష్ణ గో కులం స్కూల్ ప్రహారీ, మరో నాయకుడు నిర్మించిన షాపు, పార్టీ నాయకులు కబ్జా చేసిన దేవాలయ స్థలాలను ఎందుకు తొలగించలేదు అన్నారు.

అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం అయితే సహించేది లేదని అన్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.

విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రభాకర వర్ధన్, ఎం.భాస్కర్, నగర బిజెపి అధ్యక్షుడు రఘు రామయ్య గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్య రఘు పాల్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

విశాఖలో కిరాతకం: ఆరుగురి దారుణ హత్య

Satyam NEWS

శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

Sub Editor 2

తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ నుంచి రూ. రెండు కోట్ల విరాళం

Satyam NEWS

Leave a Comment