39.2 C
Hyderabad
May 3, 2024 11: 12 AM
Slider వరంగల్

57 ఏండ్లు నిండిన వారు ఆసరా పింఛన్ కు  దరఖాస్తు చేసుకోండి

#mulugu collector

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు  జారీ చేసిన మేరకు, అర్హులైన వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు అప్లై చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య  సోమవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు దారుల నుంచి మీసేవ నిర్వాహకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయొద్దని, సర్విస్ చార్జీలను ప్రభుత్వమే రేయింబర్స్ మెంట్ చేస్తుందని   తెలిపారు.

మీ సేవ లో నమోదు చేసుకునే సమయంలో సమర్పించవలసిన పత్రాలు  ఈ నెల 31 వరకు 57 ఏండ్లు నిండిన వృద్ధులు కొత్తగా పించన్ కు అప్లయ్ చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు. అప్లికేషన్ లో జిల్లా, మండలం, పంచాయతీ వార్డు నంబరు, స్ట్రీట్ పేరు, దరఖాస్తుదారు పేరు, ఆదార్ సెంబర్ తండ్రి/భర్త పేరు, అడ్రస్ ఆదార్ ప్రకారం పుట్టిన తేది, జెండర్, అకౌంట్ నంబర్, ఐ.ఎస్.ఎస్.సి కోడ్, బ్యాంకు బ్రాంచ్, సెల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాంతో పాటు ఫోటో, ఆదార్ కార్డు జిరాక్స్ జత చేయాలి. ఏజ్ ప్రొఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూళ్ళు, గుర్తింపు పొంది విద్యా సంస్థలు జారీ చేసిన సర్టిఫికేట్లు. ఇవి రెండు లేని వారు ఓటరు ఐడి కార్డును జత చేయాల్సి  ఉంటుందని తెలిపారు.

Related posts

లేటెస్ట్ పోస్టర్:నాగచైతన్య సాయి పల్లవి ల లవ్ స్టోరీ

Satyam NEWS

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో షాక్

Satyam NEWS

25 దేవాలయాలకు పాలక మండళ్లు

Satyam NEWS

Leave a Comment