32.7 C
Hyderabad
April 27, 2024 02: 08 AM
Slider వరంగల్

ప్రభుత్వ భూమిని కాజేసిన ప్రజాప్రతినిధులు

#MuluguCongress

ప్రభుత్వ భూమిని పట్టా చేసుకున్న వెంకటాపూర్ సర్పంచ్, సహకరించిన  తహశీల్దారు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ములుగు కలెక్టర్ కార్యాలయం లో ఏఓ శ్యామ్ కు వినతి పత్రం అందించారు. ప్రజా ప్రతినిధి ప్రభుత్వ భూమిని దొంగ పట్టా చేసుకున్నా చర్యలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి అన్నారు.

134,253 సర్వే నెంబర్ లలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులతో కుమ్మకై స్థానిక సర్పంచ్ మెడబోయిన అశోక్, భార్య వినోద పేరుతో 9ఎకరాలు పట్టా చేసుకున్నాడని వీరితో పాటు ఇతరులు సుమారుగా 60 ఎకరాలు పట్టా చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

గత 30 ఎండ్లుగా సాగులో ఉన్న పేదల భూమిని డబ్బులు తీసుకొని దొంగ పట్టాలు చేసుకున్నారని సహకరించిన తహశీల్దార్ తో పాటు ఆర్. ఐ. విఆర్వో లను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగు వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, సహకార సంఘం చైర్మన్ మండల అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, తాడ్వాయి సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, వైస్ చైర్మన్ మర్రి రాజు, ఎండీ ఆజ్జు, శంకర్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెల్లూరు కోర్టు చోరీ కేసు సుమోటో గా స్వీకరించిన ఏపీ హైకోర్టు

Satyam NEWS

ఆక్సిజన్ అందిస్తున్నాం… కొంచెం ఓపిక పట్టండి

Satyam NEWS

పెండింగ్ స్కాలర్‌షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment