39.2 C
Hyderabad
April 30, 2024 21: 11 PM
Slider శ్రీకాకుళం

నాగావళి నదిలో ఇసుక దీక్ష కు సిద్ధం

#Sand Reaches

ఇసుక ఎడ్లబండ్లు కార్మికుల సమస్య పరిష్కరించకపోతే నవంబర్5న నాగావళి నదిలో ఇసుక దీక్ష చేపడతామని  సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు హెచ్చరించారు.

నాగావళి నదీ తీరంలో ఇసుక ఎడ్లు బండ్లుపై ఆంక్షలు ఎత్తివేసి  ఎడ్లు బండ్లు ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం సమీపంలో (డచ్ భవనం వద్ద) ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో తరతరాలుగా ‌గత 50 సంవత్సరాలుగా  ఎడ్లబండ్లుతో నాగావళి నదిలో ప్రకృతి సహజంగా లభించే ఇసుక తోలుకుని కార్మికులు ఉపాధి పొందుతున్నారని ఇది వారి హక్కు అని అన్నారు.

జీవనోపాధికి దూరమైన ఎడ్ల బండి కార్మికులు

ఎండ్ల బండ్ల కార్మికులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టి ఎడ్ల బండ్లు ఆపేయడంతో ఉపాధి లేక 300 ఎడ్లు బండ్లు కార్మికుల తీవ్ర  ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి ఎడ్లు, బండ్లు కొనుక్కొని ఇసుక తోలుకుని జీవనం పొందుతుంటే వారి ఉపాధి దెబ్బతీయడం సరైనది కాదని అన్నారు.

పశువులకు దాణా కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎడ్ల బండ్లుతో చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక వేస్తారని ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ఎడ్లు బండ్లు ఇసుక కార్మికులకు ఆంక్షలు విధించకుండా ఎడ్ల బండ్లు కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధి బృందం కలెక్టర్ గారిని క్యాంప్ కార్యాలయంలో కలిసి సమస్య వివరించి ఉపాధి కల్పించాలని కోరగా ఏడ్ల బండ్లు కార్మికులతో ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేసి ఏడ్లు బండ్లు కార్మికులకు ఉచితంగా ఇసుక వేసుకునేందుకు అవకాశ కల్పించి సమస్య పరిష్కరిస్తామని  కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు టి. తిరుపతిరావు అసిరితల్లి ఎడ్ల బండ్లు కార్మిక సంఘం నాయుకులు సి.హెచ్.శ్రీనివాస్, ఎస్.వెంకటరమణ, ఏ.సాయి, పి.అసిరితల్లి, ఏమ్. శ్రీను, కె. చంద్రశేఖర్,నక్క ఆదినారాయణ, పోలయ్య, వి. సోమేశ్వరరావు,రాము, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

12న తెలంగాణ నియోగి కరణం బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు

Satyam NEWS

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా టీచర్లను సత్కరించిన మంత్రి రోజా

Satyam NEWS

గిన్నిస్ మాన్: ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తి కన్నుమూత

Satyam NEWS

Leave a Comment