38.2 C
Hyderabad
May 5, 2024 21: 59 PM
Slider గుంటూరు

కాజ లో క్రిస్టియన్ స్మశాన వాటికకు భూమి కేటాయింపుపై నిరసన

#mangalagiri

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి  పై ప్రజా ఆగ్రహాం చాపకింద నీరులా పారుతున్నది. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్ద పరిధిలో కాజ సర్వే నెం 351 లో స్మశాన పోరంబాకు 11 ఎకరాల భూమి ఉంది. దీనిలో 2 ఎకరాలు స్మశాన భూమి దళితులు, హిందువులు సుమారు 70 ఏళ్ల నుండి వినియోగించుకుంటున్నారు. సుమారు 60 ఏళ్ల నుండి మిగిలిన 3 ఎకరాల 60 సెంట్లు భూమి ని దళిత రైతులు సాగు చేసుకుని జీవిస్తున్నారు.

ఈ దశలో కాజ సర్వే నెం 351 లో ఉత్తరం వైపున 2 ఎకరాలు క్రిష్టియన్ స్మశాన వాటిక గా  మంగళగిరి నియోజవర్గ పాస్టర్స్ ఫెలొషిఫ్ అసోసియేషన్ కు కార్పొరేషన్ అధికారులు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 14వ తేదిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమెల్సీ మురుగుడు హనుమంతరావు లు పాస్టర్స్ పెలొషిఫ్ అసోసియేషన్ ప్రతినిధులకు భూమిని అప్పగిస్తూ పత్రాలు అందచేశారు.

దీంతో కాజ గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మట్టిని అమ్ముకున్నారు..కార్పొరేషన్ చెత్త తీసుకొచ్చి పోశారు.. నేడు దళితులు సాగు చేసుకుంటున్న భూమిని ప్రైవేట్ వారికి అప్పగించారు. దీనిపై గ్రామ వైసిపి, సిపిఐ, సిపిఎం, టిడిపి, దళిత సంఘాలు ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపి నిరసన దీక్ష చేపట్టారు. భవిష్యత్ అవసరాలకు గ్రామ ప్రజలకు వినియోగపడాల్సిన భూమిని 18 గ్రామాలు వ్యతిరేకించగా కాజ గ్రామంలో క్రిస్టియన్ స్మశాన వాటికకు భూమి ని కేటాయించటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

కాజ గ్రామంలో  మాల, వైశ్య, బ్రహ్మణలకు స్మశాన వాటికలు లేవు. కాజ గ్రామంలో మాల మాదిగలకు పంక్షన్ హాల్, కమ్యూనీటీ హాల్ లేవు.  వాటికి కేటాయించకుండా దళితులకు అందుబాటులో ఉన్న భూమిని నియోజకవర్గ పరిధిలో క్రిస్టియన్ స్మశాన వాటికకు కేటాయించటంపై దళిత సంఘలు, రాజకీయ పార్టీ నాయకులు  అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వెంటనే క్రిష్టియన్ స్మశాన వాటిక కు కేటాయించిన 2 ఎకరాలు భూమిని రద్దు పరచి స్దానిక దళితులు గ్రామస్తుల ఉపయోగార్దం వినియోగించాలని డిమాండ్ చేశారు.

నిరసన దీక్షకు మద్దతు తెలిపిన వారిలో వైసిపి నాయకులు అవుతూ సాంబిరెడ్డి, సత్యమరెడ్డి, సిపిఐ నాయకులు తోట గంగాధరరావు, సిపిఎం నాయకులు సింహాద్రి అది శేఖరరెడ్డి, టిడిపి నాయకులు గాదె పిచ్చిరెడ్డి, పల్లబోతుల శ్రీనివాసరావు, నంబూరి రవి, స్దానిక దళిత నాయకులు మల్లవరపు నాగయ్య, కుక్కమళ్ల సాంబశివరావు, తదితరులున్నారు.

Related posts

దిశ హత్యపై సత్తెనపల్లిలో విద్యార్ధుల నిరసన

Satyam NEWS

జీహెచ్ఎంసీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఏర్పాట్లు పూర్తి

Sub Editor

ఆపరేటర్ సంజీవ్ మృతికి అధికారులే కారణం

Satyam NEWS

Leave a Comment