39.2 C
Hyderabad
May 3, 2024 11: 26 AM
Slider వరంగల్

మంత్రులు ములుగు వస్తే ప్రజలు పోలీస్ స్టేషన్లో ఉండాలా

#seetakka

వైద్య శాఖ మంత్రి హరీష్ రావు  పర్యటన నేపథ్యంలో అంగన్వాడి, ఆశ వర్కర్లను, మధ్యాహ్న భోజన కార్మికులను దొడ్ల గ్రామ మహిళలను అరెస్టు చేయడం అన్యాయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వినతులు ఇవ్వడానికి వస్తున్న క్రమములో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి అక్రమ అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్యనికి ఇది చీకటి రోజు అని ఆమె అన్నారు. దీనిని నిరసిస్తూ ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీ, ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు కాంగ్రెస్ పార్టీ, వామ పక్ష నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క ముట్టడించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మన నీళ్ళు,మన నిధులు మన నియామకాలు అనే నినాదం తో కుల,మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో అక్రమ అరెస్టులు నిరసన తెలుపుతున్న వారి పైన దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. తమ గోడు చెప్పుకోవాలి అని ఉద్యోగులు కార్మికులు వస్తే అరెస్టులు చెయ్యడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మంత్రులు వస్తే మేము బందీ అయి ఉండాలా అని సీతక్క ప్రశ్నించారు. జిల్లా అధికారులు గులాబీ జెండా మా ఎజెండా లాగా వ్యవహరిస్తున్నారని సీతక్క విమర్శించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిపిసిసి సభ్యులు మల్లాడి రాం రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి తో పాటు సీపీఎం, సిపిఐ జిల్లా నాయకులు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related posts

రిమ్స్ ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

రోబోటిక్స్ పై సీబీఐటి లో ఆన్ లైన్ కాన్ఫరెన్స్

Satyam NEWS

అచ్చేదిన్ అంటే ఇదేనా ? అధిక ధరలతో ప్రజలు చస్తుంటే…

Satyam NEWS

Leave a Comment