38.2 C
Hyderabad
April 29, 2024 21: 47 PM
Slider ముఖ్యంశాలు

రోబోటిక్స్ పై సీబీఐటి లో ఆన్ లైన్ కాన్ఫరెన్స్

#cbit

రోబోటిక్స్ మరియు సైబర్ ఫిజికల్ మెషీన్‌లపై చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 28,29 తేదీలలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తునట్లు  ఐటి విభాగం అధిపతి ప్రొఫెసర్ రజనీకాంత్ అలువాలు తెలిపారు. యెన్ఏఎస్ఐ  సీనియర్ సైంటిస్ట్- కాన్షియస్‌నెస్ స్టడీస్ ప్రోగ్రామ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్- ఐఐఎస్సీ  క్యాంపస్  ప్రొఫెసర్ ఎల్ ఎమ్. పట్నాయక్  ముఖ్య అతిథిగా, బాల ప్రసాద్ పెద్దిగారి, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, గ్లోబల్ హెడ్ – టెక్నాలజీ అడ్వైజరీ సర్వీసెస్, అడ్వైజరీ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ గ్రూప్ –  సిఎమ్టి  యూనిట్, టిసిఎస్ ప్రారంభ సెషన్స్ కు  గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.

ఇతర వక్తలుగా సమర్జీత్ బోరా, ఎస్ఎమ్ ఐటి – సిక్కిం, లలిత్ గార్గ్- మాల్టా విశ్వవిద్యాలయం జనరల్ చైర్‌గా ప్రసంగిస్తున్నట్లు ఐటి విభాగం అధిపతి ప్రొఫెసర్ రజనీకాంత్ అలువాలు తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ కోసం ఏఐ లో సాధారణ సమస్యలు, సవాళ్లు అనే శీర్షికలపై ఇతర సెషన్‌లు, సైబర్ ఫిజికల్ సిస్టమ్‌ల పునాది శాస్త్రీయ సిద్ధాంతాలు, ఇంజినీరింగ్ విభాగాలను ఎనేబుల్ చేయడం, ఏఐ  మరియు రోబోటిక్‌లు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను ఎలా మారుస్తున్నాయి అనే అంశాలపై సదస్సులో చర్చిస్తారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్‌లను అమలు చేసే పద్ధతులు, పరిశ్రమ కోసం విశ్లేషణలు 4.0 ప్రారంభించడం క్లౌడ్ రోబోటిక్స్ ద్వారా రోబోటిక్స్-ఏ-సర్వీస్ ఫ్రేమ్‌వర్క్ పై విశ్లేషణలు ఉంటాయి. ఈ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు పరిశోధనా పత్రాలుగా సమర్పిస్తున్నారని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు.

Related posts

ఆప్ గుజరాత్ సీఎం అభ్యర్ధిగా ఇసుదాన్ గధ్వీ

Satyam NEWS

గోదావరి వరద ప్రాంతాలను సందర్శించిన పశ్చిమగోదావరి ఎస్ పి

Satyam NEWS

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment