27.7 C
Hyderabad
May 12, 2024 06: 23 AM
Slider ప్రత్యేకం

Protest: పలుచోట్ల విజయవంతమైన జాతీయ బంద్

#MagantiGopinath

రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టంను తక్షణమే రద్దుచేయాలని కోరుతూ రైతు సమాఖ్య తో పాటు, అన్ని కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరుగుతున్నది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలు బంద్ కు మద్దతు పలకడంతో రెండు రాష్ట్రాలలో  ప్రజా రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన ప్రదర్శనలు తెలియజేయడంతో, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ తీశారు, టీఆరెస్ నాయకులు , కార్యకర్తలు కోటి – ఎల్బీనగర్ ప్రధాన రహదారి ( దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ ) వద్ద ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ,

MLC దయానంద్ , నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు , నాయకులు , కార్యకర్తలతో కలసి కేంద్ర ప్రభుత్వం , మోడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ , వరి కంకుల తో నిరసన ప్రదర్శనలు నిర్వహించి ,

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును తక్షణమే రద్దుచేసి , రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

రాఖీ పార్సిల్ కోసం ఆదిలాబాద్ డిపో ప్రత్యేక స్కీమ్

Satyam NEWS

తండ్రి కాబోతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

Bhavani

కొడుకును చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి

Satyam NEWS

Leave a Comment