42.2 C
Hyderabad
May 3, 2024 15: 25 PM
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు అరెస్ట్ అక్రమం: టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్

#rtcjac

ఏపీలో టిడిపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ.. అధికార బలంతో చెయ్యని తప్పులకు అక్రమ కేసులను నమోదు చేసి అక్రమంగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన బాబుపై అధికార బలంతో జగన్ ప్రభుత్వం అక్రమ కేసులకు తెరదీసిందని, ఈ కేసులను వెంటనే విరమించుకోవాలని లేకపోతే టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో సైబరాబాద్ ను నిర్మించి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని, ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం నాడు చంద్రబాబు నాయుడు ఆలోచనతోనే సాధ్యమైందన్నారు. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పి ఇంజనీరింగ్ విద్య ప్రాధాన్యత, మహిళల అభివృద్ధికి అక్షరాస్యతకు మహిళా సాధికారికకు పెద్దపీట వేసిన వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటని ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అంటే కోట్లాదిమంది ప్రజలకు అభిమానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ అంజల్ రెడ్డి, రాజు, నవీన్, సతీష్, మైపాల్, సందీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుటుంబ నియంత్రణ పాటిస్తే ప్రగతికి నూతన అధ్యాయం

Satyam NEWS

ఈస్ట్ ఇండియా కంపెనీలాగా దేశాన్ని దోచుకుంటున్న అదానీ

Satyam NEWS

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన వైద్య బృందం

Satyam NEWS

Leave a Comment