35.2 C
Hyderabad
May 29, 2023 19: 51 PM
Slider కృష్ణ

ఈస్ట్ ఇండియా కంపెనీలాగా దేశాన్ని దోచుకుంటున్న అదానీ

#gidugurudraraju

దేశ ఆర్ధిక సంపదను కొల్లగొడుతున్న అదానీ కి అండగా ప్రధాని నరేంద్రమోడీ నిలవడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. దేశంలోని పోర్టులు ,ఎయిర్ పోర్టులు ,గ్యాస్ ,గ్రీన్ ఎనర్జీ ,మైనింగ్ ,ఇంధన రంగాలన్నింటిని ప్రధాని నరేంద్ర మోడీ అదానీ పాదాల చెంత పెట్టారని తీవ్రంగా విమర్శించారు.

నందిగామలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమములో అయన మాట్లాడుతూ ప్రజలు జీవిత భీమా కింద దాచుకున్న 90 వేల కోట్లరూపాయలను ఎల్ ఐ సి అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ప్రజల జీవితబీమా పై నీళ్లు జల్లిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆరోపించారు.

అలాగే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా సుమారు 80వేల కోట్ల ధనాన్ని అదానీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయని ఆరోపించారు. హిడెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల భాగోతం బయట పడింది అని అన్నారు. సెల్ కంపెనీలు సృష్టించి వాటిల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టించి దోచుకొని దేశ ఆర్ధిక వ్యవస్థను దివాళా తీయించే విధంగా వ్యవహరించారని విమర్శించారు.

ప్రజలు దాచుకున్న డబ్బును అదానీ లాంటి వ్యక్తులకు ధారాదత్తం చేయటంలో బీజేపీ పార్టీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు అండ దండాలు అందిస్తూ దేశాన్ని దివాళా తీస్తున్నారని విమర్శించారు. ఒక్కపుడు సామాన్యుడిగా ఉన్న గౌతమ్ అదానీ నేడు ప్రముఖ పారిశ్రామిక వేత్తతో రెండోవాడిగా నివడానికి మోడీనే కారణమని ఆరోపించారు.

పార్లమెంట్ లో ప్రశ్నించినా మోడీలో ఎటువంటి చలనం కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదానీ కి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ,బీజేపీ పార్టీ అగ్రనేతల బండారం బయటపెట్టడానికి వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించాలని డిమేండ్ చేసారు. అదానీ కి చెందిన డొల్ల కంపెనీల షేర్లు పడిపోవటం ద్వారా ఆయా కంపెనీల షేర్లు పడిపోయాయని దీంతో వేల కోట్ల రూపాయల నష్టాలు మిగిలాయని ఆరోపించారు.

అదానీ ఆర్థిక వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించే అందుకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అందుకోసం ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈనెల 13న చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.

Related posts

వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు

Bhavani

భర్తా ఇద్దరు పిల్లలు ఉన్నా మేనల్లుడ్ని ప్రేమించిన అత్త

Satyam NEWS

T20 World Cup : సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!