31.2 C
Hyderabad
May 12, 2024 01: 45 AM
Slider చిత్తూరు

మణిపూర్ లో జరుగుతున్న మారణహోమాన్ని ఖండించండి

#manipur

మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం  చిత్తూరు హై రోడ్డు పై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం లో సిఐటియు జిల్లా  కార్యదర్శి కె.సురేంద్రన్, జిల్లా అధ్యక్షుడు పి.చైతన్య, ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు,రైతు సంఘం అధ్యక్షుడు హరి లు మాట్లాడుతూ   మణిపూర్ రాష్ట్రంలో నాగా , కుకి ఆదివాసిలపై జరుగుతున్న మారణహోమాన్ని  ఆపాలని, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి  సామూహిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  మణిపూర్ రాష్ట్రంలో  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని,  మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త్ రఫ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మణిపూర్ రాష్ట్రం గత మూడు నెలలుగా అగ్నిగుండంగా  మారడానికి కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. మోదీ ప్రభుత్వం అధికారాన్ని దక్కించు కోవడానికి, పాలనను సుస్థిరం చేసుకోవడానికే నరమేధం చేస్తుందని అన్నారు. 2002లో గుజరాత్ మారణకాండను సృష్టించిన మోదీ అమిత్ షా లే నేడు మణిపూర్ రాష్ట్రానికి చిచ్చు పెట్టారని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మైతిలకు  ఎస్టి హోదాను కల్పించడాన్ని నాగా, కుకి ఆదివాసి తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, తమకు ఉన్న అవకాశాలను కోల్పోతామని భావిస్తున్నారని అన్నారు. మైతిలు రాజకీయంగా కూడా పట్టు కలిగిన వారని తెలిపారు. మైతిలకు, కుకి నాగా ఆదివాసీ తెగలకు మధ్య అగ్గి రాజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.

మే4 వ తేదీన వందల మంది దుండగుల గుంపు ఇద్దరు కుకి మహిళలను వివస్ట్రలను చేసి, నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశానికే మాయని మచ్చని అన్నారు. అందులోని ఒక మహిళకు చెందిన తండ్రిని, తమ్ముడిని కిరాతకంగా హత్య చేశారని అన్నారు.పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటనలు జరగడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ సంఘటన జరిగింది 80 రోజులు గడిస్తే కేవలం 6మందిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ అమానవీయ సంఘటన పట్ల సుప్రీం కోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారిచేయడమే కాక తామే రంగంలోకి దిగుతామని ప్రకటించిందని తెలిపారు.

ఈ మూడు నెలల కాలంలో 164 మంది చనిపోయారని, 300కు పైగా చర్చిలు నేలమట్టం చేయడం జరిగిందని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయని, లెక్కలోకి రానివి ఇంకా ఎక్కువే ఉంటాయని అన్నారు. మణిపూర్ రాష్ట్రం తగలబడుతుంటే గిరిజన మహిళ ముర్ము రాష్ట్రపతిగా ఉండి ఏమి చేస్తుందని ప్రశ్నించారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా, ప్రధాని మోదీ మణిపూర్ పట్ల వ్యవహారిస్తున్నారని అన్నారు. ఈ సంఘటనకు భాద్యత వహిస్తూ ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని భర్త్ రఫ్ చేయాలని  చేయాలని, మహిళలపై జరుగుతున్న, అత్యాచారాలను, హత్యలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు  నాయకులు గిరిధర్ గుప్తా, జ్యోతి,గోవిందు, మహిళా సంఘం నాయకురాలు చిట్టెమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేణుగాణాలంకారంలో కోదండరాముడు

Satyam NEWS

డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Bhavani

నాశనమైన లంకకు కొత్తగా అఖిలపక్ష ప్రధాని

Satyam NEWS

Leave a Comment