31.7 C
Hyderabad
May 7, 2024 02: 16 AM
Slider నల్గొండ

గుర్రపు డెక్కను తొలిగించాలని ప్రధాన రహదారిపై ఆందోళన

#protest

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో 7వ,వార్డు  ముత్యాలమ్మ గుడి వద్ద గల చెరువులో గుర్రపు డెక్కను తొలిగించాలని మున్సిపాల్టీ ఎదురు కోదాడ,మిర్యాలగూడ ప్రధాన రహదారిపై పట్టణ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు,7వ, వార్డ్ కౌన్సిలర్ వేముల వరలక్ష్మి నాగరాజు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, 3వ,వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, జక్కుల మల్లయ్య,సులువ చంద్రశేఖర్, జక్కుల నరేందర్ తదితరులు  మాట్లాడుతూ చెరులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిందని,దానిని తొలిగించాలని మున్సిపల్ కమీషనర్,చైర్ పర్సన్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుర్రపు డెక్క పెరగడం వలన నీళ్లలో అనేక క్రిములు పుట్టకొచ్చి వార్డులోని ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి గుర్రపు డెక్కను తొలిగించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన రహదారిపై 7వ, వార్డు ప్రజలు బైఠాయించి ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఈ విషయం తెలుసుకున్న యస్ఐ కట్టా వెంకటరెడ్డి హుటాహుటిన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కాంగ్రేస్ నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో 7వ,వార్డు ప్రజలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

హింసామార్గం వీడండి అహింసాపద్ధతులను అవలంబించండి

Satyam NEWS

కరోనా…కరోనా… ఏం పీడతెచ్చి పెట్టావే మాయదారి రోగమా

Satyam NEWS

ప్రారంభం కాక ముందే సక్సెస్ అయిన లోకేష్ పాదయాత్ర

Bhavani

Leave a Comment