28.7 C
Hyderabad
April 26, 2024 10: 21 AM
Slider నెల్లూరు

పిఆర్సి నివేదికను వెంటనే బహిర్గత పరచాలి

#FAPTO

శుక్రవారం ఉదయం వెంకటగిరి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట “ఫ్యాప్టో” ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఫ్యాప్టో నెల్లూరు జిల్లా అధ్యక్షులు తాళ్లూరు శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 జూలై, 2018 నుంచి అమలు చేయాల్సిన పిఆర్సి నివేదిక అందినా… ఇంకా బహిర్గత పరచకుండా కాలయాపన చేస్తున్నారని, జీవోలు ఇచ్చినా 3 డిఏ లు… పెండింగ్ లో ఉన్న 3 డీఏ లు… మొత్తం 6 డీజే లు మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి  పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని, నూతన విద్యా విధానం అమలులో భాగంగా…3,4,5  తరగతులను ప్రాథమిక పాఠశాలల నుండి ఉన్నత పాఠశాల కు బదిలీ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కోవిడ్ వల్ల మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, పదవి విరమణ పొందిన అదే విధంగా మరణించిన ఉపాధ్యాయుల తుది చెల్లింపులు కాలయాపన లేకుండా జరపాలని, ఏపీ జి ఎల్ ఐ, పి.ఎఫ్ రుణాలు, తుది చెల్లింపులు, జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాబురెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో 34 వేల ప్రాథమిక పాఠశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుమరుగు చేసే విధంగా కార్యాచరణను రూపొందించి అమలు చేయుటకు ప్రయత్నిస్తున్నదని తద్వారా ప్రాథమిక పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి సన్నాహాలు చేస్తుందని… అయినా ప్రాథమిక పాఠశాలలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా ‘ఫ్యాప్టో ఆధ్వర్యం” లో పోరాడుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో భాగస్వామి సంఘాల నాయకులు కుమారస్వామి, పీవీ రత్నయ్య, హరిబాబు, రమణయ్య, శ్రీనివాసులు, పెంచలయ్య, స్వర్ణలత ప్రసంగించారు. సిపిఐ నాయకులు బాలకృష్ణయ్య, సిఐటియు నాయకులు ఉదయభాస్కర్, ఎన్జీవో నాయకులు ఫణీంద్ర కుమార్, ఏం సీనియర్ అసోసియేషన్ నాయకులు రాధాకృష్ణా రెడ్డి, పంచాయతీరాజ్ శాఖా నాయకులు నరసింహులు, యుటిఎఫ్ నాయకులు ఉదయ్ కుమార్  ఎస్ కె పటాన్ భాష, వల్లభ దాస్, BTA డక్కిలి మండల ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య తదితరులు సంఘీభావం ప్రకటించారు.  ధర్నా అనంతరం వెంకటగిరి ఎమ్మార్వో వినతి పత్రం అందజేశారు.

వెంకటగిరి సామాన్యుడు

Related posts

మాట మార్చిన ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ నిరసన

Satyam NEWS

ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ మేలు కోసమే

Satyam NEWS

అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి

Satyam NEWS

Leave a Comment