29.7 C
Hyderabad
May 2, 2024 05: 02 AM
Slider నల్గొండ

మున్సిపాలిటీ లే అవుట్ స్థలాలను కాపాడాలి

#municipality

నల్ల దుస్తులతో వినూత్న రీతిలో నిరసన తెలిపిన 23వ వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ సమావేశం మంగళవారం జరిగింది.ఈ సమావేశం ప్రారంభం నుండి  ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు కమీషనర్ కు, చైర్ పర్సన్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. మున్సిపల్ సమావేశం ప్రారంభానికి ముందు 23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య నల్ల దుస్తులు ధరించి మున్సిపల్ కార్యాలయం ముందు వి.పి.ఆర్ వెంచర్ లో మున్సిపాలిటీ లే అవుట్ స్థలాలు కాపాడాలని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

సమావేశం ప్రారంభం కాగానే మున్సిపల్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, జక్కుల వీరయ్య, తేజావత్ రాజా, వెలిదండ  సరిత, వేముల వరలక్ష్మి,బోలెద్దు ధనమ్మ, కారింగుల విజయ లు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లే అవుట్ స్థలాల అగ్రిమెంట్లు,వివరాలు ఇవ్వాలని పట్టుబట్టారు.వి.పి.ఆర్ వెంచర్ కు చెందిన  మున్సిపాలిటీ లే అవుట్ స్థలాలు మాయం అయ్యాయని కాంగ్రెస్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి లేవనెత్తారు.దీనితో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర రావు హఠాత్తుగా లేచి డాక్యుమెంట్లు ఎవరు దొంగిలించలేదని, చెప్పడంతో కొందరు కౌన్సిలర్లు అసలు సమాధానం చెప్పాల్సింది కమీషనర్,చైర్ పర్సన్ కానీ వైస్ చైర్మన్ కు ఏమి సంబంధం అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవాక్కయ్యారు.

ఈ సందర్భంగా కొందరు ప్రతిపక్ష కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడుతూ గత పాలక వర్గంలో కౌన్సిలర్ గా ఉండి ప్రస్తుత వైస్ చైర్మన్ ప్రస్తుత పాలక వర్గాన్ని తప్పు దోవ పట్టిస్తూ వి.పి.ఆర్ వెంచర్లో మున్సిపాలిటీకి రావల్సింటువంటి భూమికి సంభందించిన పత్రాలను మున్సిపల్ కార్యాలయం నుండి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడంలో వైస్ చైర్మన్ పాత్ర ఉందని ఆరోపించారు.పది నెలల తర్వాత  అనేక ఆందోళనలు చేయడం వలన మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల విజయం అని, సహకరించిన తోటి కౌన్సిలర్ మిత్రులకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలిపారు.

పార్టీలకు అతీతంగా బహిరంగంగానే వి.పి.ఆర్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని కోరినా అధికార పార్టీ కౌన్సిలర్లు మౌనం వహించడం దేనికి సంకేతం అని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. విపిఆర్ వెంచర్ విషయాన్ని ఎజెండాలో పొందుపరచాలని చెప్పి 20 రోజుల క్రితం పార్టీలకు అతీతంగా మెజారిటీ 22 మంది కౌన్సిలర్లు కమిషనర్ గారికి వినతి పత్రం అందజేసినప్పటికీ ఎజెండాలో పొందుపరచకపోవడంలో ఆంతర్యం ఏమిటని,స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుందని  కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు.ఇట్టి విషయాన్ని చైతన్యవంతమైన హుజూర్ నగర్ పట్టణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ప్రతిపక్ష కౌన్సిలర్లు కోరారు.

కమిషనర్ పత్రికా ముఖంగా విడుదల చేసిన 43 లేఔట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కౌన్సిల్లో కౌన్సిలర్ల ముందు ప్రవేశపెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటి? ఎన్ని పత్రాలు మాయమయ్యాయి అనే విషయం అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారు. హుజూర్ నగర్ పట్టణ వ్యాప్తంగా అనేక వార్డుల్లో కుక్కలు విచ్చలవిడిగా వాహన దారులని,పిల్లలని భయభ్రాంతులు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని, అనేక కాలనీలలో పందుల సంచారం ఎక్కువ కావడం వలన అంటూ వ్యాధులు ప్రబలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రతి సంవత్సరం మున్సిపల్ సిబ్బందికి అందజేయవలసిన సబ్బులు,శానిటేషన్ పరికరాలు,దుస్తులు పంపిణీ చేయకపోవడం వల్ల సిబ్బంది కూడా ఇబ్బందికి గురి అవుతున్నారని,వీధిలైట్లు రిపేరు చేసే సిబ్బందికి ట్రాలీ నిచ్చెన,ట్రాలీ ఆటోని ఏర్పాటు చేయడంవల్ల పనులు సులభతరం అవుతాయని కౌన్సిల్ కి ప్రతిపక్ష కౌన్సిలర్లు సూచించారు.

ఇప్పటి నుండి ప్రతి నెల సమావేశం జరిపినట్లైతే పట్టణంలో ప్రజలు అవసరాలు, సమస్యలపై చర్చించడానికి వీలు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

అత్యాచారయత్నం నిందితుడిని కాపాడే యత్నం?

Satyam NEWS

ఇండిస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ హాల్ లో శ్రీరాముని శోభయాత్ర

Satyam NEWS

Leave a Comment