38.2 C
Hyderabad
May 2, 2024 21: 41 PM
Slider నెల్లూరు

సీఎంఎస్-1 నింగిలోకి కౌంట్ డౌన్ ప్రారంభం

PSLV

ఇస్ర్తో శాస్ర్తవేత్తలు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. గురువారం పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి చేపట్టనుననారు. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ నేటి మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఇప్పటికే అనేక విజయాల పరంపరలను కొనసాగిస్తున్న ఇస్ర్తో తాజాగా కమ్యూనికేషన్ శాటిలైట్ CMSa-1 ను పీఎస్ఎల్వీ సీ-50 ద్వారా నింగిలోకి పంపనుంది. ఈ శాటిలైట్ వల్ల భారత భూభాగం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఐలండ్స్ నుంచి.. శాటిలైట్ సహాయంతో .. పలు ప్రాంతాలను పరిశీలించడంలో మరింత స్పష్టత రానుందని శాస్ర్తవేత్తలు వెల్లడించారు. కాగా గురువారం మధ్యాహ్నం 3.41 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ పా్యడ్ నుంచి పీఎస్ఎల్వీ ప్రయోగం జరపనుంది. కాగా ప్రయోగానికి ముందు కౌంట్డౌన్ ప్రారంభంతో శాటిలైట్ పనితీరును పరీక్షించనున్నారు.

జీశాట్-12కు సీఎంఎస్-1 ప్రత్యామ్నాయం. దీని ద్వారా టెలిమెడిసిన్ భూకంపాలు, ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. ఈ శాటిలైట్ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రూపొందించింది. జీశాట్-12 కంటే మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ శాటిలైట్ అందుబాటులోకి తేనున్నట్లు శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. శాటిలైట్ కాలవ్యవధి ఏడు సంవత్సరాలు కాగా శాటిలైట్ బరువు మొత్తం బరువు 1410 కిలోలు.

Related posts

మృతుడి కుటుంబానికి పరామర్శ

Satyam NEWS

క్రాస్ ఓటింగ్ భయంతో రంగంలోకి గూఢచారులు

Satyam NEWS

రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment