38.2 C
Hyderabad
April 29, 2024 14: 15 PM
Slider ప్రత్యేకం

రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

#SomeshKumarIAS

జిల్లా కలెక్టర్లకు సి.ఎస్. సోమేశ్ కుమార్ ఆదేశం

రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అన్నారు.

అదేవిధంగా సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన  జాగ్రత్తలపై ప్రజలను చైతన్య ప్రర్చాలని సి.ఎస్. కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత  తగ్గించాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమీషనర్ మాణిక్ రాజ్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న లు పాల్గొన్నారు.

Related posts

అన్ని శాఖల సమన్వయంతోనే గృహ నిర్మాణాలలో పురోగతి

Satyam NEWS

నిరాహారదీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం

Satyam NEWS

గ్రీన్ సిగ్నల్: జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభించిన కేసీఆర్

Satyam NEWS

Leave a Comment