38.2 C
Hyderabad
May 2, 2024 19: 25 PM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని రథోత్సవం

#ontimitta

కడపజిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ‌నివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు.

భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో రమణప్రసాద్, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్  ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

Related posts

వన్య ప్రాణిని కాపాడిన నారాయణపేట రైతులు

Satyam NEWS

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

Satyam NEWS

బోట్ పెట్రోలింగ్ తో వలలను పట్టుకున్న కొల్లాపూర్ రేంజ్ అధికారి

Satyam NEWS

Leave a Comment