31.7 C
Hyderabad
May 7, 2024 00: 47 AM
Slider సినిమా

శివ కంఠమనేని హీరోగా వస్తున్న రాఘవరెడ్డి చిత్రం ట్రైలర్ లాంచ్

#raghavareddy

శివ కంఠమనేని హీరోగా సంజీవ్ మేగోటి దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యాన‌ర్ లో స్పేస్ విజ‌న్ న‌ర‌సింహారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన చిత్రం రాఘవరెడ్డి. ‘క్రిమినల్స్ కాంట్ ఎస్కేప్’ అనేది ట్యాగ్‌లైన్. యాక్ష‌న్‌, డ్రామా , థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ట్రెయిల‌ర్ ను హైదరాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గురువారం లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీమోహన్ పాల్గొని రాఘవరెడ్డి టీమ్ ను అభినందించారు. చిత్రం ట్రయిలర్ చూస్తుంటే హైదరాబాద్ బిర్యానీలా మసాలా దట్టించినట్లు ఉందని ఆయన అన్నారు.

ఈ చిత్రంలో నటించిన అజయ్ ఘోష్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకునే పాత్ర తనకు ఈ చిత్రంలో దొరికిందని అన్నారు. హీరో కంఠమనేని శివ మాట్లాడుతూ మంచి కథలు దొరికినప్పుడే తాను నటిస్తానని అన్నారు. దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ చిత్రంలో పాత్రధారులు అందరూ అద్భుతంగా నటించారని తెలిపారు. నిర్మాతలు ఇచ్చిన స్వేచ్ఛతో తాను అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగానని ఆయన అన్నారు. కమర్షియల్ చిత్రానికి ఉండాల్సిన అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారు అనే విషయాన్ని మరొక్క మారు నిరూపించాలని కోరారు.

ఈ చిత్రం జనవరి 4న విడుదల కాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో నందితా శ్వేత కథానాయిక. రాశి, అజయ్, శ్రీనివాసరెడ్డి, పోసాని, అజయ్ ఘోష్, బిత్తిరి సతి, అజయ్, రఘు బాబు, ప్రవీణ్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, స్నేహ గుప్తా, మీనా కుమారి, బీహెచ్ఈఎల్ ప్రసాద్, ఆర్ వెంకటేశ్వర్ రావు, చంద్రకాంత్, ల్యాబ్ శరత్ ఇతర పాత్రలు పోషించారు. జి.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వరరావు, కె.ఎస్.శంకరరావు నిర్మాతలు. కొత్త కాన్సెప్ట్ తో, ఎమోషనల్ డ్రామాతో నవరసాలు మేళవించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రం రూపొందించారు. దర్శకుడు సంజీవ్ మేగోటి ‘‘శాండల్‌వుడ్‌కి వెళ్లకముందు తెలుగులో చాలా సినిమాలు చేశారు. అక్కడ కొన్ని పెద్ద సినిమాలు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. తెలుగులో కూడా నిరూపించుకోవాలనే తపనతో ‘రాఘవ రెడ్డి’తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.

‘పోలీసులకు కూడా అంతు చిక్కని నేరాలపై పరిశోధన చేసే క్రిమినాలజీ ప్రొఫెసర్ పాత్రను శివ కంఠమనేని పోషిస్తున్నారు. నందిత తొలిసారి గ్లామరస్ రోల్ చేస్తోంది.

డైలాగ్స్ : అంజన్ , లిరిక్స్ : సాగర్ నారాయణ , మ్యూజిక్ : సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో

ఫైట్స్ : సింధూరం సతీష్ , డాన్స్ : భాను, సన్ రే మాస్టర్ (సూర్య కిరణ్), ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్

ఆర్ట్ డైరెక్టర్ : కేవీ రమణ , డిఓపి : ఎస్‌.ఎన్‌. హరీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రమణ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఘంటా శ్రీనివాస్ రావు, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి

Related posts

నీచమైన పదజాలం వాడిన మంత్రికి రాజుగారి సమాధానం ఇది

Satyam NEWS

ములుగు జిల్లా బీసీ సెల్ ఇన్చార్జిగా సురేందర్

Satyam NEWS

విజయనగరం లో గార్మెంట్ షోరూం ను ప్రారంభించిన వీఎంసీ డిప్యూటీ మేయర్

Bhavani

Leave a Comment