దైవదర్శనానికి వెళ్తున్నఆ రెండు కుటుంబాలను మృత్యువు కబ లించింది. కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట సమీపంలోని శాంతినగర్ వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన అన్నదమ్ముల కుటుంబాలు వేములవాడ దర్శనానికి వెళ్తుండగా పెంచికల్ పేట వద్ద వీరి కారును ఎదురుగా వచ్చిన (ఏపీ 07టీ జే 1466) లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మంతెన శంకర్(72), మంతెన కాంతయ్య(72), మంతెన భరత్(29), మంతెన చందన (16) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు మంతెన రేణుక, మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవిలు తీవ్రంగా గాయపడటంతో వారిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.పెంచికల్ పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొనడంతో నలుగురి దుర్మరణం పండుగ్గురి పరిస్థితి విషమం అందరూ అన్నదమ్ముల కుటుంబ సభ్యులే.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం మండలానికి చెందిన ఏడుగురు కారులో వేములవాడ దర్శనానికి వెళుతుండగా శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతి పట్ల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సత్యం న్యూస్ ములుగు