27.7 C
Hyderabad
April 30, 2024 08: 01 AM
Slider ప్రత్యేకం

కాశ్మీర్ స్కూళ్లలో రఘుపతి రాఘవ పాట పాడిస్తున్నారు

#mehaboobamufti

జమ్మూ కాశ్మీర్ లోని స్కూళ్లలో ముస్లిం పిల్లలతో ‘రఘుపతి రాఘవ రాజారామ్‌’ భజన పాట పాడిస్తున్నారని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను ప్రదర్శించారు. సోమవారం జమ్మూ పర్యటనకు వచ్చిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. పాఠశాలల్లో చిన్నారులతో కీర్తనలు పాడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీని గౌరవిస్తాం, కానీ ముస్లిం పిల్లలను భజనలు పాడేలా చేయడం తప్పు అని ఆమె అన్నారు.

మీరు గాంధీకి నివాళులర్పించినా అతి పెద్ద ఉగ్రవాది, గాంధీని చంపిన గాడ్సేను మీరు పూజిస్తారు అని ఆమె బీజేపీని విమర్శించారు. ప్రతి వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని మెహబూబా అన్నారు. ప్రతి ఒక్కరికి తన సొంత మార్గంలో జీవించే హక్కు ఉంది. ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్ పాకిస్థాన్‌ను పక్కన పెట్టి సెక్యులర్ ఇండియాతో చేతులు కలిపింది. తన ప్రేమకు ఇక్కడే రక్షణ లభిస్తుందని భావించి ఇలా చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే.. మా గుర్తింపును లాగేసుకున్నారు. మా ఉద్యోగాలు ఏమయ్యాయి?  భూములు ఏమయ్యాయి?  ఇప్పుడు మా ప్రేమను కాలరాసేందుకు వచ్చారని కేంద్ర ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.

ఇక్కడి జామియా మసీదు మూసివేశారు. మహజాబీ పండితులను ఇప్పుడు జైల్లో పెట్టారు. ఇప్పుడు మహజబ్ పై దాడి చేస్తున్నారు. భజనలు పాడమని పిల్లలను కోరడం. ఇక్కడ ప్రయోగశాల నిర్మించి హిందుత్వ ఎజెండా తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. మా ప్రజలు చాలా ఓపికగా ఉన్నారని ముఫ్తీ చెప్పారు.

Related posts

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ

Bhavani

వామ‌ప‌క్షాల బంద్ పోలీసు బందోబ‌స్తు

Sub Editor

ప్రత్యామ్నాయం చూడకుండా వీఆర్వోల రద్దు అన్యాయం

Satyam NEWS

Leave a Comment