23.2 C
Hyderabad
May 7, 2024 22: 08 PM
Slider ముఖ్యంశాలు

ఎంఎల్ఏ మేడా వర్గీయులు వైసిపి నుంచి టిడిపి లోకి జంప్

#naralokesh

అధికార వైకాపాకు రాజంపేట నియోజవర్గంలో ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వర్గీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో సోమవారం పోలిసుబ్బారెడ్డి, టిడిపి అభ్యర్థి బాలసుబ్రమణ్యం సోదరుడు సువాసి ప్రసాద్ బాబుల నేతృత్వంలో వైసిపి నేతలు టిడిపిలో చేరారు.

గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం వైకాపాకు దిమ్మ తిరిగేలా చేసింది. వైసీపీ నేతలను తెలుగుదేశం పార్టీలోకి చేర్చడం వెనుక పోలి వెంకటసుబ్బారెడ్డి చక్రం చెప్పారు. వైసిపి నుంచి అకేపాటి అమర నాధ రెడ్డి  అభ్యర్థి అయితే తనకు రాజంపేట నియోజక వర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందని సీఎంతో అన్న ఎంపీ మిథున్ రెడ్డికి రుచి చూపించారు. తన సత్తా ఏంటో మేడా రుచి చూపించారు.

సుండు పల్లె, సిద్ధవటం మండలాల్లో కీలకనేతలు టిడిపిలో చేరారు. త్వరలోనే ఒంటిమిట్ట, నందలూరు,రాజంపేట మండలాల్లో కూడా వైసీపీ నేతలు టిడిపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటా హామీ ఇచ్చారు.

ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన వారిలో సింగిల్ విండో అధ్యక్షులు జ్యోతి జగదీశ్వర్ రెడ్డి, మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ సుబ్బరాయుడు, డేగల వారి పల్లి వైకాపా నేత శంకర్ రెడ్డి, మాచుపల్లి సర్పంచ్ ప్రతినిధి మల్లు భాస్కర్ రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, భాకరాపేట సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు, ఉప సర్పంచ్ ప్రతినిధి నరసింహారెడ్డి,వ వైకాపా ప్రభుత్వంలో 11 మండల పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవని గ్రామ సర్పంచులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయిందని ప్రజా ప్రతినిధులకు గ్రామాల్లో వైకాపా ప్రభుత్వంలో విలువలు లేవని అభివృద్ధి చంద్రబాబు నాయుడు కే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.

తెలుగుదేశం పార్టీలో మరి కొంతమంది త్వరలో పార్టీలో చేరుతారని ఆయన అన్నారు. సుండుపల్లె మండలం నేత మంత్రి శివా రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. అలాగే ఒంటిమిట్ట మండలంలో చింతరాజు పల్లె, కొనరాజు పల్లె లలో కీలక నేత బొడ్డే వెంకటరమణ. కొత్తపల్లి కట్ట నారాయణ, సుబ్బరాయుడు ఉన్నారు. అనంతరం నారా లోకేష్ పోలిసుబ్బారెడ్డిని, సుగావాసి ప్రసాద్ బాబును అభినందించారు.

బిజెపి నేత రమేష్ తో బాలసుబ్రమణ్యం చర్చలు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ పోతుకుంట రమేష్ నాయుడును రాజంపేట టిడిపి అభ్యర్థి బాలసుబ్రమణ్యం కలిశారు. నియోజక వర్గంలో బిజెపి, టీడీపి కలిసి పని చేస్తామని కోరారు. తమ వంతు అంకితభావంతో కృషి చేస్తామని రమేష్ నాయుడు హామీ ఇచ్చారు. అలాగే రైల్వే స్టేషన్ నేత గునకల చిన్న, మన్నూరు మహిళా నేత మిర్యాల జ్యోతి ని కలిసి బాలసుబ్రమణ్యం చర్చించారు. మద్దతు ఇవ్వాలని కోరారు.

Related posts

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

Satyam NEWS

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్టు

Satyam NEWS

కడప లో ఏరులైపారుతున్న తెలంగాణా మద్యం

Satyam NEWS

Leave a Comment