40.2 C
Hyderabad
May 2, 2024 16: 38 PM
Slider హైదరాబాద్

పబ్ కల్చర్: బీరు బాటిళ్లతో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

rahul sipligunj

సినీ నేపథ్య గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో దాడి జరిగింది. రాహుల్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఒక పబ్‌కు బుధవారం రాత్రి  వచ్చారు. రాహుల్ వెంట వచ్చిన యువతితో కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో రాహుల్ అభ్యంతరం చెప్పాడు.

దాంతో మాటామాటా పెరిగింది. ఇద్దరూ పరస్పరం దాడులకు దిగారు. బీరు సీసాలతో కొట్టడంతో రాహుల్ కు తీవ్ర రక్తస్రావమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాహుల్‌ చికిత్స పొందుతున్నాడు.

Related posts

కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Satyam NEWS

జగన్ ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి

Satyam NEWS

పార్టీ మారేందుకు జూపల్లి మరో అడుగు ముందుకు?

Bhavani

Leave a Comment