37.2 C
Hyderabad
April 26, 2024 22: 58 PM
Slider ముఖ్యంశాలు

కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

#KhammamPolice

నమోదు అయిన ప్రతి కేసులో నాణ్యతతో కూడిన దర్యాప్తు (క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్)  చేయడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని రాష్ట్ర  డీజీపీ యం. మహేంద్రరెడ్డి అన్నారు. హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పోలీస్ కమిషనర్స్, జిల్లాల ఎస్పీల  పోలీసు అధికారులతో నెలవారీ  నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ …పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిందుతులకు శిక్షలు పడేలా పకడ్బంది చార్జ్ షీట్ తో ముందుకు కొనసాగలని సూచించారు.

పోలీసు సిబ్బంది విధినిర్వహణలో జవాబుదారీ పెంపొందించడానికి అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్స్ రాష్ట్రవ్యాప్తంగా  మంచి ఫలితాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ప్రజలు వినియోగించే డయల్ 100 కాల్స్ రెస్పాన్స్ పై ప్రజలలో మంచి స్పందన వుందని, మరింత వేగంగా స్పందించి సేవలందించాలని సూచించారు.

అదేవిధంగా ప్రతిస్పందన  సమయాన్ని  ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్  చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో  ప్రతి కేసు వివరాలను  CCTNS, ఆన్లైన్ లో నమోదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లలోని  రిసెప్షన్, పెట్రో కార్స్, కోర్టు డ్యూటీ ,సెక్షన్ ఇన్చార్జ్ లపై  స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణ నిరంతరం వుండాలని అన్నారు.

పెండింగ్ లో వున్న  కేసులు,  కేసుల డిస్పోజల్స్, కన్వెక్షన్ కు సంబంధించిన ఆంశలపై అధికారులతో చర్చించారు. సమావేశంలో అడిషనల్ డీసిపి ఆడ్మిన్ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసిపి మురళీధర్, అడిషనల్ డీసిపి (CTC) నాయక్, ఏఎస్పీ స్నేహ మెహ్రా   సిఐలు సాంబరాజు, అంజలి, పాల్గొన్నారు.

Related posts

SLTA క్యాలెండర్ ఆవిష్కరించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కేశ్ బి లాఠ్కర్

Satyam NEWS

జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చెయ్యాలి

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నిధులు

Satyam NEWS

Leave a Comment