28.2 C
Hyderabad
May 9, 2024 02: 29 AM
Slider ఖమ్మం

ఫలించిన ఎంపీ నామా కృషి: కారేపల్లి స్టేషన్ లో ఆగిన సింగరేణి

#namanageswararao

టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రాసిన లేఖకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. ఎంపీ నామ చేసిన కృషి ఫలించడంతో కారేపల్లి స్టేషన్ లో సింగరేణి రైలును రైల్వే అధికారులు శుక్రవారం నిలుపుదల చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక రైల్వే జంక్షన్ కారేపల్లిలో పలు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఆగకపోవడంతో ప్రజలు, ప్రయాణీకులు ఇబ్బందులు పడేవారు.

రైల్వే సేవలు అందుబాటులో లేక పోవడంతో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రజల పక్షాన సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు ఈనెల 17వ తేదీన లేఖ రాశారు. డోర్నకల్ నుంచి కొత్తగూడెం వెళ్లే రూట్లోని కారేపల్లి రైల్వే స్టేషన్లో రైల్ నంబర్ 7260 కాజీపేట-భద్రాచలం రోడ్డు(బీడీసీఆర్) ఆపాలని లేఖ రాశారు. ఎంపీ రాసిన లేఖను అందుకున్న రైల్వే జీఎం రైళ్ల నిలుపుదలపై దృష్టి సారించారు.

దీంతో కారేపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి రైలును నిలుపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కారేపల్లి రైల్వే స్టేషన్లో అప్, డౌన్ రెండు వైపులా కాజీపేట-భద్రాచలం రోడ్డు(బీడీసీఆర్) రైలు ఆపేందుకు నిర్ణయం తీసుకున్నారు. కారేపల్లిలో సింగరేణి రైలు నిలుపుదల విషయం ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుకు రైల్వే జీఎం గజానన్ మాల్య ఫోన్ చేశారు. కారేపల్లితోపాటు గార్ల, ఓదెల రైల్వే స్టేషన్లలో సింగరేణి రైలును నిలుపుదల చేస్తున్నట్లు  రైల్వే జీఎం చెప్పారు.

భద్రాచలం రోడ్డు నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే సింగరేణి కారేపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి రైలు హాల్టింగ్ చేస్తున్నట్లు జీఎం వివరించారు. కారేపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి రైల్ నిలుపుదల చేయడానికి కృషి చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావు తీసుకున్న కృషి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సింగరేణి రైలు నిలుపుదల కోసం ఎంపీ నామ ప్రత్యేకంగా దృష్టిసారించి రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రజలు, రైల్వే ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సెలబ్రేషన్ టైమ్: ఆనం మీర్జాకు వచ్చింది పెళ్లికళ

Satyam NEWS

ఘనంగా చింతమనేని ప్రభాకర్ పుట్టిన రోజు

Bhavani

ఎనాలసిస్: సారూ ఇంకా ఉంచుతారా? ఇక ఎత్తుతారా?

Satyam NEWS

Leave a Comment