35.2 C
Hyderabad
May 9, 2024 16: 11 PM
Slider విజయనగరం

విజయనగరం ఉత్సవ ప్రారంభానికి వర్షం అడ్డంకి…

విజయనగరం జిల్లా లో ఇవాళ్టి నుంచీ ప్రారంభం కానున్న విజయనగరం ఉత్సవాల సందర్భంగా ప్రారంభ సూచికగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అయ్యింది. కానీ రాత్రికి రాత్రే ఆకాశం మేఘావృతమై.. మబ్బులు కమ్మి…సరిగ్గా ర్యాలీ ప్రారంభసమయానికి వర్షం మొదలవ్వడంతో..జిల్లా యంత్రాంగాన్ని కాస్త ఆందోళన కు గురి చేసింది. దీంతో తొలుత మూడులాంతర్ల నుంచీ ర్యాలీ ప్రారంభం అయి…అయోధ్య మైదానంకు చేరాలి.

కానీ ఉదయం నుంచీ ముసురుతో ఆగకుండా వర్షం కురుస్తుండటంతో…08.00 ప్రారంభం కావలసిన ర్యాలీ.. ప్రారంభం కాకపోవడం..అలాగే ర్యాలీ కి అంతగా ఎవ్వరూ… అధికారులు కూడా ఇక సెక్రటరీలు కూడా పరిపూర్ణంగా హాజరు కాలేదు. వచ్చిన.. తడుసుకుంటూ..గొడుగులు పట్టుకుని రావడం కనిపించింది. దీంతో ర్యాలీ రూట్ ను…అయోధ్య మైదానం వరకు కాకుండా ఆనందగజపతి ఆడిటోరియంకు మార్పు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ర్యాలీ కూడా.. సింహాచలం మేడ వరకు కొనసాగించనున్నట్లు సమాచారం. కానీ ర్యాలీ ప్రారంబమయ్యే స్థలానికి కేవలం జిల్లా రెవెన్యూ అధికారి, డీఎంఅండ్ హెచ్ ఓఅలాగే ఐ అండ్ పీఆర్ శాఖ అధికారులు మాత్రమే కనిపించారు..చూద్దాం విజయనగరం ఉత్సవాలు.. ఏ విధంగా ముందు కు సాగుతుందో..

Related posts

“హలో హాలీవుడ్” అంటున్న తెలుగుతేజం “రాజ్ దాసిరెడ్డి”

Satyam NEWS

నులి పురుగులను నివారిద్దాం – పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుదాం

Satyam NEWS

గుడ్ గోయింగ్: బిచ్కుందలో 96శాతం పల్స్ పోలియో

Satyam NEWS

Leave a Comment