40.2 C
Hyderabad
May 2, 2024 18: 21 PM
Slider సినిమా

నో రెన్యూవల్: హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించబోము

rajasekhar

హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించబోమని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన తన కారును స్వయంగా నడుపుతూ, ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడగా, గడువు ముగిసిన లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోకుండా ఆయన వాహనాన్ని నడిపారని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ వెల్లడించారు. అతివేగంతో ఆయన ప్రయాణించారని తేలిందని స్పష్టం చేశారు. దీంతో ఆయన లైసెన్స్ ను రద్దు చేశామని, గడువు ముగిసిన తరువాతనే అది చెల్లుబాటులోకి వస్తుందని, మధ్యలో రెన్యువల్ చేసే అవకాశాలు లేవని అన్నారు.

కాగా, గడచిన రెండేళ్ల వ్యవధిలో 12 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పాయింట్లను తెచ్చుకున్న వాహన దారుల డ్రైవింగ్ లైసెన్స్ లను 3 నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేశామని, డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వారి లైసెన్స్ లు కూడా సస్పెన్షన్ లో ఉంచామని ఆయన అన్నారు.

Related posts

వి ఎస్ యు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డ్స్

Satyam NEWS

కొత్త సినిమా విడుదల రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే నేరుగా చూసే అవకాశం

Bhavani

మంత్రి అల్లోలకు శుభాకాంక్షల వెల్లువ

Satyam NEWS

Leave a Comment