37.2 C
Hyderabad
May 2, 2024 12: 58 PM
Slider గుంటూరు

రుషికొండకు సిఎం జగన్ పరుగో పరుగు

#balakotaiah

పిల్లి తన పిల్లలను ఏడు చోట్లకు మార్చుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని 30 చోట్లకు మారుస్తానంటూ ఐదేళ్ల తర్వాత పలాయనవాదిగా  రిషికొండకు పరుగు తీస్తున్నారని, రాజధాని పేరు చెప్పలేక క్యాంపు కార్యాలయం పేరుతో పారిపోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.  ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా రాజధానికి భూములు ఇచ్చిన రైతులను, రాష్ట్ర ప్రజలను వంచించి,  రాజధానిని నాశనం  చేసి,  తాను మాత్రం రూ .433 కోట్లతో నిర్మించుకున్న రాజ విలాసంలోకి వెళ్ళిపోతున్నట్లు చెప్పారు. 

మూడు రాజధానుల మూర్ఖపు విధానాలతో ఐదేళ్లు సాధించింది ఏమీలేదని, మరో వంద, 150 రోజుల్లో రిషికొండలో కూర్చుని ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా సాధించేది  ఏమీ ఉండబోదన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని, తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లు కొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని చెప్పారు.  150 కిలోమీటర్ల వాయువేగంతో మార్పు అనే వాయుగుండం వస్తున్నట్లు, అది ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశాన్ని తాకే అవకాశం కూడా ఉందన్నారు. నియంతలా వెర్రవీగిన కేసీఆర్  ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదన్నారు. 

కేవలం తెలంగాణ ఎన్నికల్లో స్నేహితుడి గెలుపు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాగార్జునసాగర్ డ్యాం పై నీళ్ళ నాటకం ఆడారన్నారు. అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలు, జాబ్ క్యాలెండర్, భవన నిర్మాణ కార్మికుల బతుకు తెరువు, విద్యుత్ చార్జీలు,  నిత్యావసర వస్తువులు, పెట్రోల్ , డీజిల్ వడ్డన ధరలు పెంచారని, దళితులపై దాడులు, హత్యలు తప్ప రాష్ట్రంలో వైసిపి సాధించింది ఏమీ లేదన్నారు.  రాష్ట్రంలో ఐదేళ్ళల్లో  వైకాపా పెట్టిన ఫ్యాక్టరీని కానీ, కట్టిన ప్రాజెక్టు కానీ, ఇచ్చిన ఉద్యోగం కానీ, నిర్మించిన ఊరు కానీ చూపాలని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు.  

చూడగలిగిన వారికే కళ్ళు ఉండాలని, వినగలిగిన వారికే చెవులు ఉండాలని,  మాట్లాడగలిగిన వారికే నాలుక ఉండాలని అంటూ ఈ మూడూ వైకాపాకు లేవని చెప్పారు.  యుద్ధంలో ఎప్పుడూ రెండు పక్షాలే ఉంటాయని , ఉంటే ఆవల పక్షం, లేకపోతే  ఈవలి పక్షం, ఉంటే కౌరవ పక్షం, లేదా పాండవ పక్షం, ఉంటే అధికారపక్షం లేదా ప్రజాపక్షం ఉంటుందని, ఈ తేడా తెలియని వారు కర్ర సాములో కర్ర తిప్ప లేక కాళ్ళు ,చేతులు విరగొట్టుకుంటురన్నారు. విపక్ష పార్టీలు పోరాడే శక్తులను ఆహ్వానించాలని, తగిన గౌరవంతో యుద్ధంలోకి దింపాలని బాలకోటయ్య విపక్షాలకు సూచించారు. విలేకరుల సమావేశంలో రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శిరంశెట్టి నాగేంద్ర రావు , బహుజన  రాష్ట్ర నాయకులు మామిడి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అనుమతివ్వండి

Satyam NEWS

తాగు నీటి సమస్యను పరిష్కరించిన అంబర్ పేట్ ఎమ్మెల్యే

Satyam NEWS

కామారెడ్డి ఎన్నికల బరిలో 39 మంది: జిల్లా వ్యాప్తంగా 67 మంది

Satyam NEWS

Leave a Comment