29.7 C
Hyderabad
May 6, 2024 06: 12 AM
Slider ముఖ్యంశాలు

ఘనంగా రాముని పట్టాభిషేకం 

#bhadradri

జగదభిరాముని పట్టాభిషేకం కన్నుల పండుగగా. అంగరంగా వైభవంగా జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో అశేష భక్త జనం మధ్య  వేద మంత్రోచారణల నడుమ , జై శ్రీరామ్ నినాదాలతో వైభవంగా జరిగింది. ఆనాడు రాముని పట్టాభిషేకం సమయంలో పెద్దలు, పురోహితులు, సోదరులు ఎలా వ్యవహరించారో సరిగ్గా అదే తరహాలో తంతు నిర్వహించారు. మిథిల స్టేడియం రామ నామంతో  మార్మోగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిలిసై  హాజరయ్యారు.  స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈసారి పుష్కర పట్టాభిషేకం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రామనామంతో స్టేడియం మార్మోగింది. ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయారు. గత ఏడాది గవర్నర్ పట్టాభిషేకానికి వచ్చినప్పటికి జిల్లా అధికారులoతా డుమ్మా కొట్టారు. ఈ సారి మాత్రం కలక్టర్, ఎస్‌పి సహా అధికారులంతా ఆమెతోనే వున్నారు. భద్రాచలంలో శ్రీరామ నవమి మరియు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాలకు రెండు రోజులుగా దేశం నలుమూలల నుంచి లక్ష మందికిపైగా తరలివచ్చి ప్రత్యక్షంగా వేడుకలను తిలకించారు.

Related posts

విద్యార్థులకు ఇంగ్లీషు గ్రామర్ ను సులభతరం చేసిన బిఎన్ఆర్

Satyam NEWS

శ్రీశైల పుణ్య క్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకారం

Satyam NEWS

వాతావ‌ర‌ణ మార్పుల‌పై ప్ర‌పంచం ప్ర‌త్యేక దృష్టిపెట్టాలి

Satyam NEWS

Leave a Comment