24.7 C
Hyderabad
March 26, 2025 09: 25 AM
Slider సినిమా

సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుటకు రామ్ గోపాల్ వర్మ

1559481043_ram-gopal-varma

ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని కోరారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే రాజకీయ వ్యంగ్య చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిన నేపథ్యంలో ఆ సర్టిఫికెట్ ను ప్రముఖ మతబోధకుడు కే ఏ పాల్ తనకు ఇస్తున్నట్లు మార్ఫింగ్ ఫొటోను ట్విట్లర్ లో పోస్టు చేసిన రామ్ గోపాల్ వర్మపై కే ఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తాము దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని, రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని జ్యోతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులతో రేపు ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులు ముందుకు వర్మ రావాల్సి ఉంది.  

Related posts

మోడీ…వచ్చి మిమ్మల్ని కాపాడు

Satyam NEWS

డెత్‌లెస్ పోయెట్…

Satyam NEWS

20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడింది

Satyam NEWS

Leave a Comment