28.7 C
Hyderabad
April 27, 2024 03: 21 AM
Slider ఆధ్యాత్మికం

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

Inavolu

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి  దయాకర్ రావు అన్నారు. ఆదివారం ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ అటవీ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అధ్యక్షతన  జరిగిన ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  డాక్టర్ టి. రాజయ్య, జిల్లా కలెక్టర్ ప్రశాంత్  జీవన్ పాటిల్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాలలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లలో లోపాలను అధిగమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిచేయాలని చెప్పారు.

ఫిబ్రవరి లో సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నందున అక్కడ నుండి భక్తులు తిరిగి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నందున ఎంతమంది భక్తులు వచ్చిన వారికి అసౌకర్యాలకు తావివ్వకుండా సమిష్టి కృషితో నిర్దేశించిన నిధులను బాధ్యతాయుతంగా వుపయోగించి అభివృద్ధి పనులు చేయాలని చెప్పారు.

గతంలో జాతరలో  రెండు మూడు సార్లు పనిచేసిన అధికారుల వివరాలను సేకరించి వారిని ఎక్కడున్నా డిప్యుటేషన్ పై పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. మేడారం సమ్మక్క సారలమ్మ అయినవోలు బ్రహ్మోత్సవాలను చాలెంజ్ గా తీసుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. 24 గంటల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యాధికారులను షిఫ్టు ప్రకారంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.

అయినవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటల పాటు పని చేసేందుకు అనుమతి జారీ చేసినందున బ్రహ్మోత్సవాల సందర్భంగా 24 గంటల పాటు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచి అంతరాయం కలగకుండా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు బస్సుల సంఖ్యలు పెంచాలని కాజీపేట గన్ పూర్ వరంగల్ తొర్రూర్ ప్రాంతం నుండి భక్తులకు బస్సులను ఏర్పాటు చేయాలని ప్రత్యేకమైన బస్ స్టాండు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

బందోబస్తు చర్యలు పటిష్టంగా ఉండాలని వాహన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రైవేటు వాహనాలకు వాహనాలు పార్కింగ్ ఏర్పాటు ట్రాఫిక్ నియంత్రణ విఐపిల పర్యటన భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఉప పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. నిరంతరంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని  నగరపాలక సంస్థ నుండి శానిటేషన్ సిబ్బంది ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు.

అటవీ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇలాంటి ఇబ్బందులు సౌకర్యము కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లకు అధికారుల సమిష్టి కృషి ఎంతో అవసరమని ఆయా శాఖల అధికారులు భక్తులను దృష్టిలో పెట్టుకొని ఏలాంటి లోటుపాట్లు లేకుండా ఘనమైన ఏర్పాట్లను చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ జె పాటిల్ మాట్లాడుతూ ఆయా శాఖలకు కేటాయించిన బాధ్యతలు విధులు బ్రహ్మోత్సవాలకు రెండు రోజుల ముందు నుండే ఏర్పాట్లను పూర్తి  చేయాలని సౌకర్యాల కల్పనలో ఎవరు అలసత్వం వహించకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.

వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి అయినవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని గతంలో కంటే భక్తుల రద్దీ పెరిగిందని బుధవారం ఆదివారంలో ఎక్కువమంది వచ్చి దర్శించుకుంటారని  సంక్రాంతి నుండి ఉగాది వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయిన సెంట్రలైజ్డ్ అవినీతి: కన్నా

Satyam NEWS

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

Satyam NEWS

బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడితో రహ్మతుల్లా భేటీ

Satyam NEWS

Leave a Comment