23.7 C
Hyderabad
May 8, 2024 05: 44 AM
Slider హైదరాబాద్

ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద రాణిరుద్రమ నిరసన

#RaniRudrama

ఎన్నికల కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ ఏకపక్షతీరుపై యువతెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమ మండిపడ్డారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల చిరునామాలు కేవలం అధికారపార్టీకి ఇచ్చి, అధికారిక జాబితా నుండి చిరునామాలు తొలగించి.. ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తూ తీవ్ర నిర్లక్ష్యధోరణితో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం తమకు ఓటర్ల వివరాలు కావాలని బుద్దభవన్‌లోని ఎన్నికలసంఘం కార్యాలయానికి వెళ్ళిన రాణిరుద్రమ వినతిని కమిషనర్‌ తోసిపుచ్చడంతో పాటు మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం.. మీకు అడిగే హక్కు లేదనడంతో ఆమె భగ్గుమన్నారు.

ఎన్నికలసంఘం కార్యాలయంలోనే బైఠాయించి షాకిచ్చారు. గంటకు పైగా నిరసన తెలపగా, పోలీసులు జోక్యం చేసుకుని.. వినతిపత్రం తీసుకునేలా, దృవీకరణ ఇచ్చేలా అంగీకరించారు. దీంతో వివాదం ముగిసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ చెప్పినట్లు.. ఎన్నికల సంఘం అధికారులు పనిచేస్తున్నారని, ఈ చర్య ద్వారా రుజువవుతోందని యువతెలంగాణ పార్టీ నేత రాణిరుద్రమ అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరరిస్తే.. అన్ని వేదికలపైనా పోరాడుతామన్నారు.

Related posts

సగం కాలిన కరోనా శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

Satyam NEWS

పిఎం కేర్స్ నిధికి సిఐఎస్ఎఫ్ 16 కోట్ల విరాళం

Satyam NEWS

ఏపి డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Satyam NEWS

Leave a Comment