42.2 C
Hyderabad
May 3, 2024 17: 51 PM
Slider జాతీయం

వచ్చే ఏడాది నుంచి JEE Main నాలుగు సార్లు

#RameshPokhriyal

వచ్చే ఏడాది JEE Main నాలుగు సార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ వెల్లడించారు. ఇవాళ సాయంత్రం  ఆయన మీడియాతో ఆన్‌లైన్‌ మాట్లాడారు.

JEE Main పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 తేదీల మధ్య జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తామని, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలలో ఈ పరీక్షలు ఉంటాయని, తేదీలో తరవాత ప్రకటిస్తామన్నారు.

కొత్త పద్ధతిలో ప్రశ్న పత్రం రూపొందిస్తున్నామని, ఇందులో నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదని అన్నారు. 15 ప్రత్యామ్నాయ ప్రశ్నలు ఉంటాయన్నారు.90లో 75 ప్రశ్నలకు విద్యార్థి సమాధానం రాయాల్సి ఉంటుందన్నారు.

కెమిస్ట్రి, ఫిజిక్స్‌, మ్యాథమాటిక్స్‌ సెక్షన్స్‌లోని ప్రతి 30 ప్రశ్నలకు 25 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుందన్నారు. JEE Main మొత్తం 13 ప్రాంతీయ పరీక్షల్లో నిర్వహిస్తామన్నారు.

Related posts

స్తంభించిన పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ..గంట సేపు నిలచిపోయిన ఈ చలానాలు…!

Satyam NEWS

26న ప్రారంభం కానున్న లులూ మాల్

Bhavani

ముగిసిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి యాగం

Satyam NEWS

Leave a Comment